విశాఖపట్నం వాల్తేరు క్లబ్ కు సంబంధించి, ఈ రోజు హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. కొంత మంది విశాఖ వాల్తేరు క్లబ్ పై కన్నేసారని, గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అది ప్రభుత్వానిదా, ప్రైవేటుదా అంటూ వివాదం గత కొన్ని నేలలుగా నడుస్తుంది. గతంలో 1964లో వాల్టర్ క్లబ్ కు ఉన్న పట్టాకు సంబంధించి, కావాలని ఇప్పుడు వివాదం తెచ్చారని, ఆ భూములు కొట్టేసే ప్లాన్ వేసారని, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని పై ప్రభుత్వం ఒక సిట్ ను కూడా ఏర్పాటు చేసింది. ఈ మొత్తం వ్యవహారం పై విచారణ చేయాలని ఆదేశించింది. అయితే ఈ కేసు హైకోర్టుకు చేరింది. దీని పై ఈ రోజు విచారణ జరిగింది. అయితే ఈ మొత్తం అంశం పై, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై కోర్టుకు వెళ్ళారు. అయితే ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఈ అంశం పై స్టే విధించింది. సిట్ విచారణ పై కూడా స్టే విధించింది. వాల్తేరు క్లబ్  వివాదం పై, సిట్ ఎటువంటి చర్యలు ఇక ఈ వ్యవహారంలో ముందుకు వెళ్ళకూడదు అని, మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు, ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అని, ఇది సివిల్ వివాదం కాబట్టి, సిట్ జోక్యం చేసుకోకూ డదు అని, తదుపరి విచారణ పై స్టే విధించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read