తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోగ్యం బాగోకపోయినా, ఆయనకు వెంటవెంటనే, రెండు ఆపరేషన్లు జరిగినా, ప్రభుత్వం ఆయన్ను హాస్పిటల్ నుంచి హుటాహుటిన డిశ్చార్జ్ చేసి, జైలులో పెట్టటం పై, అచ్చెన్నాయుడు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తన ఆరోగ్యం బాగోలేదని, ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స చేయించుకుంటానికి, అవకాసం ఇవ్వాలని, ఖర్చు మొత్తం తామే భరిస్తాం అంటూ, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీని పై, గత వారం వాదనలు జరిగాయి. దీని పై, ఈ రోజు హైకోర్టు తీర్పు ఇచ్చింది. అచ్చెన్నాయుడుకి మెరుగైన వైద్యం కోసం, ప్రైవేటు హాస్పిటల్ కు తరలించాలని, ఈ రోజు హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అచ్చెన్నాయుడుని ఏ హాస్పిటల్ కు తరలించాలని అనుకుంటున్నారు అంటూ, హైకోర్టు అచ్చెన్నాయుడు తరుపు న్యాయవాదిని అడిగింది. అచ్చెన్నాయుడు తరుపు న్యాయవాది, ఈ సందర్భంగా, విజయవాడలో మూడు హాస్పిటల్ పేర్లు, గుంటూరులో రెండు హాస్పిటల్ పేర్లు కోర్టుకు చెప్పారు.

అయితే ఈ సందర్భంలో, ప్రభుత్వ తరుపు న్యాయవాది అభ్యంతరం చెప్పారు. అచ్చెన్నాయుడుని ఏ హాస్పిటల్ కు తరలించాలి, అసలు తరలించాలా లేదా అనే విషయం పై, గుంటూరు జీజీహెచ్ సూపర్ఇంటెన్దేంట్ ఆదేశాలు ఇస్తారని, కోర్టుకు చెప్పారు. అయితే ఈ దశలో కోర్టు జోక్యం చేసుకుని, ఆదేశాలు ఇచ్చింది. గుంటూరులోని రమేష్ హాస్పిటల్ కు తరలించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీని పై అతి త్వరలోనే ఉత్తర్వులు వచ్చే అవకాసం ఉంది. హైకోర్టు నుంచి ఉత్తర్వులు రాగానే, విజయవాడలోని జిల్లా జైలు పోలీసులకు చూపించి, ఆయన్ను హాస్పిటల్ కు తరలించే అవకాసం ఉంది. ఈ రోజు సాయంత్రం లోపు, ఆయన్ను హాస్పిటల్ కు తరలిస్తారు. ఇక మరో పక్క, అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ కూడా, హైకోర్టు ముందు పెండింగ్ లో ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read