ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న అమరావతిని, మూడు ముక్కల రాజధానులు చేస్తూ, ఒక ముక్క వైజాగ్, ఒక ముక్క కర్నూల్, ఒక ముక్క అమరావతి అంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, దానికి సంబంధించి బిల్లులను ఆమోదించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లుల పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. గత నెల రోజులకు పైగానే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు ముక్కల రాజధాని బిల్లుల పై, హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఇప్పటికే రైతుల తరుపున, ఇతర పిటీషనర్ల తరుపున వాదనలను హైకోర్టు వింది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు సీనియర్ లాయర్,దుష్యంత్‌ దవే ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన వాదనలు వినిపిస్తూ, రాజధాని నిర్ణయం విషయం అనేది రాష్ట్ర శాసనసభకు సంబందించిన నిర్ణయం అని చెప్పారు. ఇందులో పార్లమెంట్ కు సంబంధం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం నిర్ణయాదికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని అన్నారు. రాజధాని ఎక్కడ ఉండాలి, ఎన్ని రాజధానులు ఉండాలి అనేది రాష్ట్రం ఇష్టం అని, మూడు రాజధానులు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని పిటీషనర్ లు చెప్పటం కరెక్ట్ కాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూల్, శాసన రాజధానిగా అమరావతిని నిర్ణయం తీసుకుందని అన్నారు. అయితే ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న హైకోర్టు, ఒక మౌలికమైన ప్రశ్న అడగటంతో, రాష్ట్ర ప్రభుత్వ డొల్లతనం బయట పడింది.

hc 09122020 2

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును రాష్ట్రప్రతి, అమరావతిలో నోటిఫై చేసారు కదా, ఇప్పుడు మళ్ళీ దాన్ని న్యాయ రాజధాని పేరుతో కర్నూల్ తరలించే హక్కు మీకు ఎక్కడిది అంటూ, హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే ఇక్కడ ప్రభుత్వ వైఖరి బయట పడింది. కర్నూల్ లో హైకోర్టు అనేది కేవలం ప్రతిపాదన మాత్రమే అని, దీనికి సంబంధించి చర్యలు ఏమి ప్రారంభించలేదని చెప్పింది. అయితే దీనికి బదులు ఇస్తూ, ఒక పక్క చట్టం చేసి, కేవలం ప్రతిపాదన అని అలా అంటారు అంటూ హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఈ అంశం పై ప్రతిపక్షం తెలుగుదేశం భగ్గు మంటుంది. కర్నూల్ ప్రజలను మభ్య పెట్టటం కోసమే, ఈ రాజధాని డ్రామా ఆడారని, కర్నూల్ కి హైకోర్టు మార్చటం అయ్యే పని కాదు అని తెలిసినా, కేవలం వైజాగ్ భూములు పై కన్ను వేసి, ఇటు కర్నూల్ ప్రజలను, అమరావతి ప్రజలను మభ్య పెడుతూ, వైజాగ్ భూములు పై కన్ను వేసారంటూ తమ అధికార సోషల్ మీడియాలో తెలుగుదేశం విమర్శించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read