ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న రెండు కీలక నిర్ణయాల పై హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో వాలంటీర్ లను, ఎన్నికల ప్రక్రియలో పాల్గునకూడదు అని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొద్దిసేపటి క్రితం సస్పెండ్ చేస్తూ, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గుంటున్నారని, అదే విధంగా ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తూ, అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వారికి ఓటర్ స్లిప్పులు ఇస్తూ, ప్రత్యర్ధి వర్గానికి చెందిన వారికి ఓటర్ స్లిప్పులు ఇవ్వటం లేదని, పైగా సంక్షేమ పధకాల పేరిట లబ్దిదారులను బెదిరిస్తూ, ఓటు వేయక పొతే ఆ పధకాలను కట్ చేస్తాం అంటూ బెదిరిస్తున్నారని కూడా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు దాదాపుగా, 600 వరకు ఫిర్యాదులు వెళ్ళాయి. ఈ ఫిర్యాదులు పై స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్, వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గునకూడదు అని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జారీ చేసిన ఉత్తర్వులు పై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై వాదనలు విన్న హైకోర్టు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులు నిలిపి వేస్తూ, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దీంతో పాటుగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న మరో నిర్ణయం పై కూడా హైకోర్టు స్పందించింది.

hc 0630302021 2

గతంలో నామినేషన్ల సందర్భంగా, పురపాలకసంఘాలు, నగరపాలక సంస్థల్లో నామినేషన్ వేయలేక పోయారో, వారి అందరికీ కూడా అవకాసం కలిపిస్తు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులు కూడా రాష్ట్ర హైకోర్టు, ఆ ఉత్తర్వులు కూడా సస్పెండ్ చేస్తూ, ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు జిల్లా పుంగనూరు, తిరుపతి, కడప జిల్లా రాయచోటి, యర్రగుంట్ల, ఈ పురపాలక సంఘాల్లో నామినేషన్లు తిరిగి వేసే అవకాసం కల్పించింది. అయితే వీరిని కూడా బెదిరించటంతో, కేవలం ముగ్గురు మాత్రమే నిన్న సాయంత్రం వరకు నామినేషన్ వేసారు. ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం, హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్లినప్పటికీ, హైకోర్టు కొద్ది సేపటి క్రితం, ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులును కూడా సస్పెండ్ చేస్తూ, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యంగా ఒకసారి నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తరువాత, మళ్ళీ ఎలా అనుమతి ఇస్తారు అంటూ పిటీషనర్ బలంగా వాదించారు. అయితే ఈ విషయంలో మాత్రం, పెద్దగా ఎవరూ నామినేషన్ వేయకపోవటం, కేవలం ముగ్గురే వేయటంతో, ఇందులో పెద్దగా ఇబ్బంది లేదనే చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read