జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల పై హైకోర్టు ఆశ్చర్య పోయింది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ప్రశ్నిస్తూ, ప్రభుత్వం పై విరుచుకు పడింది. రేషన్ దుకాణాల ద్వారా కాకుండా, ఇంటికి రేషన్ సప్లయ్ చేసే విధానం, దాని ద్వారా జరుగుతున్న నష్టం పై, రేషన్ షాపులు డీలర్లు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీని పై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచనాలో పడేసలా ఉన్నాయి. మీ ప్రభుత్వం విధానం ఏమిటో అర్ధం కావటం లేదు అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఒక పక్కన ఇంటి పక్కనే రేషన్ షాపు ఉన్నా సరే, మొబైల్ వ్యాన్లు వేసుకుని మరీ వచ్చి ఇంటికి వచ్చి, రేషన్ సప్లయ్ చేస్తున్నారు. మరో పక్క, స్కూల్స్ విలీనం పేరుతో, చిన్న పిల్లలను మూడు నాలుగు కిమీ వెళ్లి మరీ చదువుకునే పరిస్థితి తీసుకుని వచ్చారు. ఈ నిర్ణయాలు ఏంటి ? మీ విధానం ఏమిటి ? మీరు తీసుకునే నిర్ణయాల్లో హేతుబద్ధత ఏది ? అంటూ హైకోర్టు ప్రభుత్వం పై విరుచుకు పడింది. తమకు కుదిరిన సమయంలో, రేషన్ షాపుకు వెళ్లి, సరుకులు తెచ్చుకునే పరిస్థితిలో, ఈ రాష్ట్రంలో ప్రజలు లేరని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. డీలర్లు ద్వారా రేషన్ సరఫరా చేయటానికి, వాహనాల ద్వారా సరఫరా చేయటానికి, ఎంత అదనపు ఖర్చు అవుతుందో తెలుసు కదా అని వ్యాఖ్యానించింది.

jagan 19072022 2

ఇంత ఖర్చు చేసినా, మీరు ఏ ఉద్దేశంతో డోర్ డెలివరీ చేయాలని అనుకున్నారో, అది నెరవేరటం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పధకం కోసం 92 వేల మందిని పెట్టుకున్నారని, వారికి 21 వేలు ఇస్తున్నారని, అలాగే 600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసారని, ఇంత డబ్బుతో, పేదలకు మరింత ఎక్కువ రేషన్, ఎక్కువ సరుకులు ఇవ్వొచ్చు కదా, మీరు చేసేది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం కాదా అని కోర్టు ప్రశ్నించింది ? గతంలో పేద ప్రజలు, తమకు తోచిన సమయంలో వెళ్లి సరుకులు తెచ్చుకునే వారని, ఇప్పుడు ఎప్పుడు ఆ బండి వస్తుందో తెలియక, పనికి వెళ్ళకుండా ఇంట్లో ఉండలేక, అటు పని మానేయటమో, లేదా ఇంట్లో లేక సరుకులు తీసుకోలేక పోవటమో చేస్తున్నారని, రేషన్ కోల్పోవాల్సి వస్తుందని హైకోర్టు పేర్కొంది. ఈ రేషన్ కోసం కేంద్రం కూడా వాటా ఇస్తుందని, డోర్ డెలివరీ గురించి కేంద్రం వద్ద అనుమతి తీసుకున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో డోర్ డెలివరీ చేసారంటే అర్ధం ఉంది కానీ, ఇలా ఇంటి పక్కన రేషన్ షాపు ఉన్నా డోర్ డెలివరీ ఏంటో అర్ధం కావటం లేదని పేర్కొంది. కోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read