తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తనని ప్రైవేటు హాస్పిటల్ కు మార్చాలి అంటూ, హైకోర్టు ముందు పిటీషన్ పెట్టుకోవటం, దానికి హైకోర్టు అంగీకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు ఇచ్చిన పూర్తి ఉత్తర్వులు చూస్తే, హైకోర్ట్ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా ఏసీబీ దర్యాప్తు అధికారుల తీరు పై, హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు అధికారి ప్రవర్తించిన తీరు, తీవ్ర అభ్యంతరం అని, పైల్స్ లాంటి ఆపరేషన్ అయిన వ్యక్తిని, 600 కిమీ ప్రయాణం చేపించిన తీరు, అంతరాత్మ ఉన్న ఏ మానవుడికైనా బాధ కలిగిస్తుందని కోర్ట్ పేర్కొంది. అంతే కాకుండా, అచ్చెన్నాయుడుకి ఆపరేషన్ అయ్యిందన్న విషయం తెలియదు అని చెప్పిన అధికారి మాటలు నమ్మసక్యంగా లేవు అంటూ, హైకోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు అధికారి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, కంటికి కన్ను, పంటికి పన్ను అనే విధానం నుంచి, మన సమాజనం, దూరం జరిగి చాలా రోజులు అయ్యింది అంటూ, కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఎలాంటి వారికైనా రాజ్యాంగ పరిరక్షణ ఉంటుంది అనే విషయం, కొన్ని హక్కులు ఉంటాయి అనే విషయం, దర్యాప్తు అధికారులు తెలుసుకోవాలని పేర్కొంది. కనీస మానవ హక్కులు, రూల్ అఫ్ లా అనేవి లేకుండా ప్రవర్తించిన తీరు గర్హనీయం అని కోర్టు పేర్కొంది. తీవ్రమైన నేరాలు చేసినా, వారికి అన్ని రకాల రాజ్యాంగ హక్కులు ఉంటాయాని తెలుసుకోవాలని కోర్టు చెప్పింది. అచ్చెన్నాయుడు రెండు ఆపరేషన్లు అయ్యాయని, స్పెషల్ జడ్జి అనుమతి తీసుకున్న తరువాతే, జిల్లా జైలుకు తరలించాలని పేర్కొంది. అచ్చెన్నాయుడు కేసులో మానవ హక్కుల ఉల్లంఘన ఎలా జరిగిందో, జూన్ 23, 24 తేదీల్లో ఇచ్చిన హెల్త్ బులిటెన్ చేస్తూనే అర్ధం అవుతుంది అంటూ కోర్టు ఆక్షేపించింది. హెల్త్ బులిటెన్ కు, రాసిన లేఖకు ఉన్న తేడా చూస్తే, అచ్చెన్నాయుడుని ట్రీట్ చేసిన విధానం అర్ధం అవుతుంది అంటూ కోర్టు తెలిపింది. చివరకు కొన్ని టెస్టులు చేసి, రిపోర్టులు రాకుండానే డిశ్చార్జ్ చెయ్యటం వెనుక అర్ధం ఏమిటి అంటూ కోర్టు ప్రశ్నించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read