అమరావతి అంశం పై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్, మూడు రాజధానులు, సిఆర్డీఏ రద్దు అంటూ ఇచ్చిన గెజిట్ పై అమరావతి పరిరక్షణ సమితి కోర్టుకు వెళ్ళింది. ఈ అంశం పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. అధికార వికేంద్రీకరణతో పాటుగా, సీఆర్డీఏ రద్దు బిల్లుల పై హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. ఆగస్టు 14 వరకు స్టే వర్తిస్తుందని హైకోర్టు తెలిపింది. ఆ లోగా రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమకు కౌంటర్ వెయ్యటానికి సమయం కావాలని, పది రోజులు సమయం కావాలి అంటూ ప్రభుత్వం తరుపు న్యాయవాది కోరగా, కోర్టు దానికి అంగీకరిస్తూ, ఆగష్టు 14కు వాయిదా వేసి, అప్పటి వరకు ఈ బిల్లుల పై ముందుకు వెళ్ళటానికి లేదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంటే హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు, ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ముందుకు వెళ్ళటానికి లేదు. అంతే కాదు, ఈ రెండు బిల్లులు ఇప్పుడు ఆమోదంలో లేనట్టే అవుతుంది.

అమరావతి రాజధానిగా, సిఆర్డీఏ లైవ్ లో ఉంటూ ఉంటుందని, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు చూస్తే అర్ధం అవుతుంది. పది రోజులు తరువాత ప్రభుత్వం ఇచ్చే కౌంటర్ ని బట్టి, స్టే ని పొడిగించటం కానీ, లేదా తదుపరి ఆదేశాలు ఇవ్వటం కానీ జరుగుతుంది. ఏది ఏమైనా, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం ఆగష్టు 15న మేము వైజాగ్ వెళ్ళిపోతాం అని లీకులు ఇస్తున్న తరుణంలో, ఆగష్టు 14 వరకు హైకోర్టు స్టే ఇవ్వటంతో, ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. కౌంటర్ వెయ్యమని స్టే ఇవ్వటంతో, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే కౌంటర్ ఎలా ఉంటుంది, హైకోర్టు ఆ కౌంటర్ ని పరిగణలోకి తీసుకుంటుందా, అనేది చూడాలి. ఏది ఏమైనా కౌంటర్ వెయ్యమని వాయిదా వెయ్యకుండా, స్టేటస్ కో ఇచ్చి, ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే ఉండాలని, స్టే ఇచ్చి మరీ హైకోర్టు వాయిదా వెయ్యటంతో, ఇది ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అనే చెప్పాలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read