ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు హైకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వైసిపీ ప్రభుత్వం, ముందుగా కొంత మంది మంత్రులతో కలిసి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు, గౌతమ్ రెడ్డి, అలాగే స్పెషల్ ఆహ్వానితుడుగా విజయసాయి రెడ్డి ఉన్నారు. వెళ్ళందరూ కలిసి తెలుగుదేశం పార్టీ నేతలు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసారని తేల్చారు. దీంతో ప్రభుత్వం ఒక సిట్ వేసింది. అలాగే ఆ సిట్ కు కొన్ని అధికారాలు కూడా ఇచ్చింది. అయితే ఏ విధమైన ప్రాధమిక ఆధారాలు లేకుండా, ఏమి బయటకు చెప్పకుండా, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే, ప్రతిపాక్షలను టార్గెట్ చెయ్యటానికే ఈ సిట్ వేసారని, ప్రాధమిక ఆధారాలు లేకుండా, గత ప్రభుత్వం చేసిన నిర్ణయాల పై సమీక్షలు చెయ్యటం కోసం ఎంక్వయిరీలు వెయ్యటం గతంలో లేవని, ఏదైనా తప్పిదాలు ఉంటే, ఆధారాలు చూపించి ముందుకు వెళ్ళాలని తెలుగుదేశం తన వాదన వినిపించింది.

అయితే దీని పై ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తూ ఉండటంతో, తమను ఇబ్బంది పెట్టటానికి ప్రభుత్వం వ్యూహ రచన చేసిందని గ్రహించి, సిట్ ఏర్పాటు పై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఏ విధమైన ప్రాధమిక ఆధారాలు లేకుండా, కేవలం ప్రతిపక్షాలను టార్గెట్ చెయ్యటానికి, గత ప్రభుత్వ నిర్ణయాల పై సమీక్ష చేస్తున్నారని, ఇది సరి కాదని హైకోర్టులో వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, దీని పై మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ, సిట్ విచారణ పై స్టే విధించింది. ఇది కేవలం ప్రతిపక్షాలను టార్గెట్ చెయ్యటానికి దురుద్దేశంతో చేసిన పని అంటూ, తెలుగుదేశం నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ వేసిన పిటీషన్ పై హైకోర్ట్ స్టే ఇస్తూ, తదుపరి ఆదేశాల వరకు స్టాయ్ విధించింది. దీని పై మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్పందిస్తూ, ఎలాంటి వివాదం లేకున్నా, ఏ ఆధారాలు లేకుండా, తమ పై ఆరోపణలు చేసి, అల్లరి చెయ్యటానికే సీట్ వేసారని, ఏదైనా చేస్తాం అని ప్రభుత్వం బెదిరిస్తుందని, న్యాయ స్థానం తమ వాదనతో ఏకీభావించి, ప్రభుత్వ దురుద్దేశ చర్యను అడ్డుకుందని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read