తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరిని పోలీసులు అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెట్టిన సంగతి తెలిసిందే. టిడిపి పార్టీ ఇచ్చిన బంద్ కాల్ సందర్భంగా నాదెండ్ల బ్రహ్మం బంద్ లో పాల్గున్న సందర్భంలో, అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత సాయంత్రం, అందరినీ వదిలి పెట్టినా నాదెండ్ల బ్రహ్మంను మాత్రం వదిలి పెట్ట లేదు. ఆయన ఆచూకీ లభ్యం కాక, ఆందోళన చెందారు. చివరకు తరువాత రోజు ఉదయం అతని ఆచూకీ లభ్యం అయ్యింది. పోలీసులు కస్టడీలో ఉన్నట్టు అప్పుడు చెప్పారు. అయితే ఆయన్ను స్థానిక కోర్టులో ప్రవేశ పెట్టగా, పోలీసులు కొట్టారని మేజిస్ట్రేట్ కు చెప్పారు. చివరకు నాదెండ్ల బ్రహ్మంను రిమాండ్ కు పంపారు. దీంతో నాదెండ్ల బ్రహ్మం, హైకోర్టులో బెయిల్ కోసం పిటీషన్ వేసారు. దీని పై శనివారం అన్ని కేసులతో పాటు, ఇది కూడా విచారణకు వచ్చింది. ఈ సందర్భంలో ఈ ససే విచారణను సోమవారం విచారణ చేస్తాం అని చెప్తూనే, కోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. పోలీసులతో పాటుగా, కింద కోర్టు మేజిస్ట్రేట్ల పై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసులు ఆలోచన ఏమిటి, అసలు మీరు ఏమి చేయాలి అనుకుంటున్నారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

magistrate 24102021 2

నాదెండ్ల బ్రహ్మం కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెట్టిన సెక్షన్లు అన్నీ ఏడేళ్ళ లోపు సెక్షన్లు అని, మరి 41ఏ నోటీసులు ఇచ్చి, ముందుగా విహరణ చేసి, మేజిస్ట్రేట్ అనుమతి తీసుకుని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటూ కోర్టు ప్రశ్నించింది. నిబంధనలను మీ ఇష్టం వచ్చినట్టు తుంగలోకి తొక్కుతారా అంటూ ప్రశ్నించింది. పోలీస్ స్టేషన్లో అతన్ని కొట్టటం ఏమిటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ వైఖరి పై కూడా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఒక పక్క అతన్ని పోలీసులు కొట్టిన విషయం నమోదు చేసారు, మరి రిమాండ్ కు ఎందుకు ఇచ్చారు అంటూ కోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో అసలు ఏమి జరుగుతుంది, సామాన్యుల పరిస్థితి ఏమిటి అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు వైఖరి పై అనేక ఫిర్యాదులు తమకు వస్తున్నాయని, అన్నీ గమనిస్తున్నాం అని హెచ్చరించింది. నాదెండ్ల బ్రహ్మం బెయిల్ విషయం పై సోమవారం నాడు విచారణ చేస్తాం అని కోర్టు తెలిపింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read