ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, హైకోర్టు, సుప్రీం కోర్టు ఎక్కడకు వెళ్ళినా, మెజారిటీ కేసుల్లో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఒక్కో సందర్భంలో, కేసు తీవ్రతన బట్టి, జడ్జీలు ఘాటుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా కొన్ని సందర్భాల్లో చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తూ, కోర్టులు మాట కూడా వినని సందర్భాల్లో, కోర్టు ధిక్కరణ కేసులు, డీజీపీ, చీఫ్ సెక్రటరీలను కోర్టుకు పిలవటం వరకు అనేకం చేసారు. అయితే ఈ చర్యలను ప్రభుత్వం, తాము తప్పు చేసాం, ఎక్కడ సరి చేసుకోవాలి అని చూడకుండా, జడ్జిలు తమ పై కక్ష కట్టారు, చంద్రబాబు మ్యానేజ్ చేసారు అంటూ, వింత వాదన ముందుకు తీసుకోవచ్చింది. అంతే కాదు, ఏదో జడ్జిలతో పోరాటం చేస్తున్నట్టు, పలానా జడ్జి సరిగ్గా పని చేయటం లేదు, పలానా జడ్జిని చంద్రబాబు మ్యానేజ్ చేసారు అంటూ, ఏకంగా చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు లేఖలు కూడా రాసారు. అయితే సాధారణ ట్రాన్స్ఫర్ లో భాగంగా, ఏపి చీఫ్ జస్టిస్ బదిలీ అయితే, అది తమ ఒత్తిడి వల్లే జరిగింది అంటూ ప్రచారం చేసుకున్నారు. కొత్త చీఫ్ జస్టిస్ వచ్చేశారు, ఇక అన్నీ మాకు అనుకూలంగా తీర్పులు వస్తాయి అనే విధంగా మాట్లాడారు. అయితే, ఎక్కడైనా జడ్జీలు చట్టాలు, న్యాయాలు చూసి తీర్పులు ఇస్తారు కానీ, ఎక్కడా ఇష్టం వచ్చినట్టు తీర్పులు ఇవ్వరు అనే విషయం గ్రహించాలి. అందుకే జడ్జిలు మారినా, జడ్జిమెంట్లు మాత్రం, ఒకేలా ఉంటాయి.

jaganhc 21012021 2

దానికి కారణం, ఏ జడ్జి అయినా చట్ట ప్రకారమే తీర్పులు ఇస్తారు. ఇదే విషయం గత మూడు రోజులు నుంచి అర్ధం అవుతుంది. ముందుగా అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ గత నాలుగు ఏళ్ళుగా చేస్తున్న విష ప్రచారానికి హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. 80 పేజీల తీర్పులో, ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదమే చట్టంలో లేదని, భూములు కొనుగోలుకు, దీనికి సంబంధం లేదని, అందరికీ అమరావతిలో రాజధాని వస్తుందని తెలిసిన తరువాత, కొన్నారని తీర్పు ఇచ్చింది. ఇక ఆ తరువాత మరో విష ప్రచారం అయిన పింక్ డైమెండ్ పై, ఇప్పటికే పింక్ డైమెండ్ లేదని సుప్రీం కోర్టు వేసిన కమిటీ నివేదికలు ఉన్నాయి కాబట్టి, విచారణ అవసరం లేదని చెప్పింది. ఇక మరో పక్క అమరావతి రైతులు పై పోలీసులు అక్రమంగా పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసు కూడా హైకోర్టు కొట్టేసింది. అలాగే వైజాగ్ వాల్తేరు క్లబ్ వివాదం పై, సిట్ విచారణ పై స్టే విధించింది. ఇక అన్నిటికంటే మించి, పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అంటూ, ప్రభుత్వానికి షాక్ ఇస్తూ ఈ రోజు నిర్ణయం ప్రకటించింది. నిజానికి, ఏ జడ్జి ఉన్నా, ఇదే రకమైన తీర్పులు వస్తాయి. ప్రభుత్వం ఇప్పటికైనా, మంచి సలహదారులను పెట్టుకుని, చట్ట ప్రకారం నిర్ణయాలు తీసుకుంటే, అన్ని వ్యవస్థల మీద గౌరవం పెరుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read