రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శాంతియుతంగా నిర్వహించే ప్రదర్శనలను అనుమ తించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సోమవారం సాయంత్రం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాలలో పూజలు చేసుకునేందుకు అడ్డుచెప్పరాదని, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ సత్యనారాయణ మూర్తిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. సెక్షన్ 1-4-4 కింద నిబంధనలు పాటించకుండా వ్యవహరించిన పోలీస్ అధికారుల పట్ల ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అరెస్ట్ చేసిన వారి జాబితాలను వెంటనే సంబంధిత జుడిషియల్ మేజిస్ట్రేట్లు ముందుంచాలని ధర్మాసనం ఆదేశించింది. మొత్తం పది అంశాలపై స్పందిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని గ్రామాల్లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నదని, ధర్మాసనం అభిప్రాయపడింది. గ్రామాల్లో పోలీస్ కవాతు ఎందుకు నిర్వహిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది.

court 14012020 2

రాజధాని గ్రామాల్లో 1-4-4 సెక్షన్ ఎందుకు విధించాల్సి వచ్చిందో చెప్పాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధాని అమరావతి పరిరక్షణ కోసం రైతులు, మహిళలు ఆందోళన చేస్తున్న నేపధ్యంలో పోలీసులు సెక్షన్ 1-4-4 క్రింద నిషే-ధాజ్ఞలు జారీచేశారు. మహిళలు, రైతులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలు సైతం వెలువడ్డాయి. జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకొని క్షేత్ర స్థాయి పరిశీలనకు ఒక బృందాన్ని పంపించింది. సంప్రదాయంగా నిర్వహించుకునే పూజలు, మొక్క బడులు చెల్లించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాలన్నింటి పైనా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సుమోటోగా స్పందించింది. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను పత్రికలు, ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా స్పందించి వివరణ ఇవ్వాల్సిం దిగా ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇదే విషయమై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది.

court 14012020 3

రాజధాని ప్రాంతానికి చెందిన న్యాయవాది పారా కిషోర్ ఈ పిటీషన్ దాఖలు చేశారు. సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశాలకు విరుద్ధంగా పోలీసులు రాజధాని గ్రామాల్లో 1-4-4 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు జారీ చేసి ప్రజలను భయ-భ్రాంతులకు గురిచేస్తున్నారని, మహిళలు, రైతుల పట్ల అమా-నుషంగా ప్రవర్తిస్తున్నా రని వాటిని నియంత్రించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తన పిటిషన్లో న్యాయమూర్తిని అభ్యర్థించారు. పిటీషనర్ తరుపున ప్రముఖ హైకోర్టు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదించారు. ఇదే తరహాలో మరికొన్ని పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటీషన్లను అత్యవసరమైనవిగా భావించి లంచ్ మోషన్లో విచారించాల్సిందిగా కోరారు. పిటిషన్లను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి, ఈ సంఘటనలపై హైకోర్టు సుమోటోగా స్పందిస్తుందని ప్రకటించి విచారణను మధ్యాహ్ననికి వాయిదా వేశారు. వాయిదా అనంతరం న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్నారు. రాజధాని ప్రాంతంలో రైతులు, మహిళలు నిరసనలు వ్యక్తం చేసుకునేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని పిటీషనర్ తరపు న్యాయవాది ఇంద్రనీల్, న్యాయమూర్తిని అభ్యర్థించారు. పోలీసులు వ్యవహార శైలిపై న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేసేందుకు 20వ తేదీ వరకు గడువు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ న్యాయమూర్తిని కోరారు. అందుకు న్యాయమూర్తి నిరాకరించి కేవలం మూడు రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. ఈ నెల 17వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read