ఆంధ్రప్రదేశ్ సిఐడి పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక యూట్యూబ్ ఛానల్ పై సిఐడి అధికారులు ప్రవర్తించిన తీరు విషయంలో, హైకోర్టు తీవ్ర అభ్యంతరం చెప్పింది. మీరు ఉన్నది ప్రజల రక్షణ కోసం కానీ, అధికార పార్టీ మెప్పు పొందటానికి కాదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలుగు వన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పై, రెండు నెలల క్రిందట సిఐడి పోలీసులు హైదరాబాద్ వెళ్లి, అక్కడ సర్వర్ లు అన్నీ స్వాధీన పరుచుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా తెలుగు వన్ అధినేత రవిశంకర్ పై కూడా కేసు నమోదు చేసారు. తన పై నమోదు అయిన కేసు విషయం పై రవి శంకర్ ఏపి హైకోర్టు లో క్వ్యాష్ పిటీషన్ వేసారు. తన పై వేసిన కేసు కొట్టేయాలని హైకోర్టుని కోరారు. ఈ విషయం పై సిఐడి పోలీసులను తప్పు పడుతూ, గత నెల 26న హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాల పూర్తి కాపీ నిన్న బయటకు వచ్చింది. ఇందులో అనేక అంశాలు, కోర్టు సిఐడి పై చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. మనం ఉన్నది డెమోక్రసీ, కనీ మీ తీరు చూస్తుంటే ఖాకిస్టోక్రసీలో జీవిస్తున్నాం అనే భావన కలుగుతుంది అంటూ కోర్టు వ్యాఖ్యానించింది.

ఖాకిస్టోక్రసీ అంటే, పోలీస్ రాజ్యం అనే విధంగా హైకోర్టు స్పందించింది. ఈ కేసు విషయంలో, కేసు నమోదు దగ్గర నుంచి, కంప్యూటర్లు, సర్వర్లు తీసుకురావటం, దర్యాప్తు తీరు, అన్నీ చూస్తుంటే సిఐడి పోలీసుల అత్యుత్సాహం కనపడుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇది అరాచకత్వానికి దారి తీసే విధంగా ఉందని, సరైన ఆధారాలు లేకుండా కేసు నమోదు చేసి, దర్యాప్తు పేరుతొ వేధించటం అన్యాయం అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యలకు బ్రేక్ వెయ్యకపోతే, ప్రజలకు జీవించే హక్కు కానీ, స్వేఛ్చ కానీ లేకుండా, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగితే తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయని కోర్టు హెచ్చించింది. సిఐడి పోలీసులు అధికారాన్ దుర్వినియోగానికి పాల్పడ్డారని, పెట్టిన సెక్షన్లకు, చేస్తున్న అబియోగాలకు సంబంధం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. శాంతిభద్రతలు కాపాడటం సిఐడి ప్రాధమిక విధి అని కోర్టు గుర్తు చేసింది. అంతే కాకుండా కేసు కొట్టేసి, సిఐడి స్వాధీన పరుచుకున్న పరికరాలు అన్నీ తిరిగి వారికి ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read