చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా, ఉపాధి హామీ పధకం సమర్ధవంతంగా ఉపయోగించుకుని, అన్ని పనులూ చేసుకుంటూ, రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలకు పని కల్పిస్తూ, సమర్ధవంతంగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారు. అప్పట్లో దేశంలోనే నెంబర్ వన్ గా, ఈ కార్యక్రమంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఘనత సాధించింది. అయితే ఎన్నికల ముందు దాదపుగా రెండు మూడు నెలలు చేసిన పనికి, కేంద్రం నుంచి నిధులు రాలేదు. ఈ నిధులు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత, రెండు నెలలకు వచ్చాయి. దాదపుగా 1845 కోట్లు కేంద్రం, రాష్ట్రానికి విడుదల చేసింది. అయితే కేంద్ర వాటికి తోడుగా, మరో 461 కోట్లు రాష్ట్రం తరుపున విడుదల చేసి, పంచాయతీలకు విడుదల చెయ్యాల్సి ఉంది. అయితే, కేంద్రం ఇచ్చిన 1845 కోట్లు కాని, రాష్ట్ర వాటా కాని, ఇప్పటి వరకు, లబ్దిదారులకు చేరలేదు. అయితే ఆ 1845 కోట్లు ఎందుకు విడుదల చెయ్యటం లేదు అనేది, ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు.

highcourt 15112019 2

ఆ మధ్య కాలంలో, ఈ విషయం పై గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేసారు. చంద్రబాబు కూడా కేంద్ర మంత్రికి లేఖ రాసారు. కేంద్రం ఇచ్చిన 1845 కోట్లు, వేరే వాటికి మళ్ళించారని, చట్ట ప్రకారం, కేంద్రం విడుదల చేసిన మూడు రోజుల్లో ఆ నిధులు ఇవ్వాలని అన్నారు. అయితే, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం, ఈ నిధులు ఇవ్వలేదు. ఈ విషయం పై, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా, కృష్ణా జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ పై, హైకోర్ట్ లో వాదనలు జరిగాయి. కేంద్రం ఇచ్చిన ఆ 1845 కోట్లు, పంచాయతీలకు ఎందుకు బదిలీ చెయ్యలేదు, కారణం ఏమిట్ చెప్పండి, అంటూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్ట్ నిలదీసింది.

highcourt 15112019 3 style=

దీనికి బాధ్యులు ఎవరో చెప్పాలని, రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 2019-2020 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్రం ఇచ్చిన నిధుల్ని ప్రభుత్వం వేరే అవసరాలకు వినియోగించిందని, పిటీషన్ దారులు, కోర్ట్ కు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌, జూలై, ఆగస్టు నెలల్లో రూ.1845 కోట్లను, రాష్ట్రానికి విడుదల చేసిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం, మరో రూ.461 కోట్లు జత చేసి మూడు రోజుల్లోగా గ్రామ పంచాయతీలకు విడుదల చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఇవ్వలేదని కోర్ట్ కు తెలిపారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్ట్, వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి చెప్పి, రెండు వారాలకు వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read