తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పోలవరం విషయంలో ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. పోలవరం పనులు సాఫీగా, ఫాస్ట్ గా సాగుతున్నాయి, మీరు కాంట్రాక్టర్ ను మార్చకండి, మా మీద కక్షతో కాంట్రాక్టర్ ని మార్చితే, ఇది న్యాయ పరంగా కేసు అవుతుంది, అలా జరిగింది అంటే, న్యాయస్థానాల్లో కేసు తేలేదాకా, పనులు ముందుకు సాగవు, ఇది రాష్ట్రానికి మంచిది కాదు, అంటూ చంద్రబాబు చెప్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం వినిపించుకోకుండా, అందులో అవినీతి జరిగిపోయింది అంటూ, అవినీతిని ఇప్పటి వరకు నిరూపించకుండా, రివర్స్ టెండరింగ్ అంటూ, పోలవరం ప్రాజెక్ట్ లో మిగిలిపోయిన హెడ్ వర్క్స్ తో పాటుగా, పోలవరం హైడెల్ ప్రాజెక్ట్ తో కలిపి, టెండర్ ను పిలిచింది. అప్పటికే ఉన్న నవయుగతో ఒప్పందం రద్దు చేసుకుంది. అయితే టెండరింగ్ లో, కేవలం మేఘా ఒక్కటే పాల్గుని, ఆ పనులను మేఘా సంస్థ దక్కించుకుంది.

polavaram 08112019 2

అయితే హైడల్ ప్రాజెక్ట్ విషయం పై నవయుగ సంస్థ తీవ్రంగా స్పందిస్తూ, ఒప్పందం రద్దుకు గల కారణాలు చెప్పలేదంటూ, కోర్ట్ కు వెళ్ళింది. ఆగష్టు నెలలో కోర్ట్ కు వెళ్ళగా, అక్కడ జడ్జి నవయుగకు అనుకూలంగా తీర్పు ఇస్తూ, పనుల పై స్టే విధించారు. అయితే దీని పై ప్రభుత్వం, మళ్ళీ అప్పీల్ చెయ్యటంతో, హైకోర్ట్ సింగల్ బెంచ్, ప్రభుత్వానికి అనుకూలంగా స్టే ఎత్తివేసింది. అయితే దీని పై మరోసారి, నవయుగ హైకోర్ట్ ఫుల్ బెంచ్ ముందుకు వెళ్ళింది. మొన్న హైకోర్ట్ లో, సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ, మరో పిటీషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం మమ్మల్ని అకారణంగా తప్పించిందని, ఒప్పందం మొత్తం పరిగణలోకి తీసుకోకుండా, సింగల్ బెంచ్ తీర్పు ఇచ్చిందని, దాని పై స్టే ఇవ్వాలంటూ, హైకోర్ట్ లో పిటీషన్ వేసింది.

polavaram 08112019 3

అయితే, దీని పై, ఈ రోజు హైకోర్ట్ లో విచారణ జరిగింది. పోలవరం హైడల్‌ ప్రాజెక్ట్‌ పనులు, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులు అందరికీ హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. అయితే, ఇది ప్రభుత్వానికి షాక్ అనే చెప్పాలి. మొన్న సింగల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలతో మా విజయం అని చెప్పిన ప్రభుత్వం, మరి ఈ విషయం పై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక మరో పక్క ఈ ఆదేశాలు హైడల్ ప్రాజెక్ట్ వే అయినా, మేఘా సంస్థ టెండర్ మాత్రం, హెడ్ వర్క్స్ తో పాటుగా హైడల్ ప్రాజెక్ట్ కూడా కాబట్టి, మరి మేఘా సంస్థ హెడ్ వర్క్స్ పనులు చేస్తుందో, తడుపరి ఆదేశాలు వచ్చేదాకా ఆగుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read