తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎన్నికల ప్రచారంలో, ప్రభుత్వ నిధులు వినియోగించారని, దీన్ని తప్పు బడుతూ బోరుగడ్డ అనిల్‌ అనే వ్యక్తి పిటిషన్‌ వేశారు. పుసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ వంటి పథకాల పేరుతో ఓటర్లను ప్రభావితం చేశారని బోరుగడ్డ అనిల్‌ తన పిటీషన్ లో పేర్కొన్నారు. అందుకే ఈ ఖర్చు అంతా, చంద్రబాబు సొంత ఖర్చుల కింద నిధులను వసూలు చేయాలని హైకోర్ట్ ని కోరారు. అనిల్‌ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈపిటీషన్‌ పై ఈనెల 18న విచారణ జరుగనుంది. అయితే ఈ బోరుగడ్డ అనిల్‌ ఎవరో కాదు, అప్పట్లో రమణ దీక్షితులతో కలిసి చంద్రబాబు పై ప్రెస్ మీట్ లో విమర్శలు చేసిన వ్యక్తి.

ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఒక క్రిస్టియన్ చారిటీ సంస్థను నిర్వహిస్తున్నారు. సైమన్ అమృత్ ఫౌండేషన్ పేరుతో మత ప్రచార కార్యక్రమాలను అనిల్ నిర్వహిస్తున్నాడు. గుంటూరుకు చెందిన ఇతను.. సైమన్ అమృత్ ఫౌండేషన్ సంస్థకు సీఈవో, ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో అమరావతిలో భూ వివాదంలో డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప పేరు చెప్పుకొని పలు నేరాలకు పాల్పడ్డాడు. కొన్ని సెటిల్మెంట్లు చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గుంటూరులోని వల్లూరివారి తోటలో… భీం సేన పేరుతో ఓ కార్యాలయం కూడా ప్రారంభించారు. భీంసేన రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ప్రస్తుతం కొనసాగుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read