12 ఓట్లుతో గెలిచిన ఎమ్మల్యే... ఎవరైనా ప్రజలకి మంచి చేసి, వచ్చే ఎలక్షన్స్ లో ఇలా 12 ఓట్లుతో కాకుండా, 12 వేల ఓట్లతో గెలివాలి అనుకుంటారు... కాని ఈయన ప్రజలను గాలికి వదిలేసి, వాళ్ళ పార్టీ అధినేత సేవలు తరిస్తూ ఉంటాడు... ఏ లిటిగేషన్ దొరుకుతుందా, ఎవరి మీద కేసు వేద్దామా అని చూస్తూ ఉంటాడు... చివరకి ఏ కేసు నిలబడు అనుకోండి అది వేరే విషయం... కాని, ఈ లోపు కేసు వేసి, సాక్షి టీవీలో హడావిడి చేస్తూ ఉంటారు... కేసు కొట్టేసిన రోజు మాత్రం, అసలు సాక్షిలో వార్తే ఉండదు... అమరావతి పై కేసులు, సధావర్తి భూములు, ఫైబర్ గ్రిడ్ పై కేసు, ఇలా ఒకటి రెండు కాదు, పదుల సంఖ్యలో కేసులు వెయ్యటం, మొట్టికాయలు తినటం, ఈయనకు బాగా అలవాటు. మంచి పని కోసం అయితే ఎవరికీ ఇబ్బంది ఉండదు, కాని ప్రతిది రాజకీయ ఉద్దేశంతో వేస్తే ఇలాగే ఉంటుంది.

alla 15082018 2

చాలా రోజులుగా సైలెంట్ అయిన ఆళ్ళ మళ్ళీ, హైకోర్ట్ లో ఒక కేసు వేసారు. ‘సాధికారమిత్ర’ అనే వ్యవస్థతో, ప్రభుత్వం, రాజకీయ ప్రయోజనం ఆశిస్తుందని, ఇవి రద్దు చెయ్యాలని కోరారు. నవంబర్ 23,2017న ‘సాధికారమిత్ర’లను నియమిస్తూ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, దీని వల్ల పంచాయతీల వ్యవస్థ దెబ్బ తింటుందని, అందుకే వీరిని రద్దు చెయ్యాలని కోరారు. ‘సాధికారమిత్ర’లను తన సొంత బ్రాండింగ్ కోసం, చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని పిటీషన్ లో చెప్పారు. అయితే, దీని పై హై కోర్ట్ అభ్యంతరం చెప్పింది. రాజ్యాంగంలో కాని, పంచాయతీ రాజ్ చట్టంలో కాని, ఇలాంటి పనులు పంచాయతీ సిబ్బంది మాత్రమే చెయ్యాలని ఎక్కడా లేదని కోర్ట్ చెప్పింది.

alla 15082018 3

మంచి పని చేసే ఎవరైనా, ఈ పనులు చెయ్యవచ్చు అని చెప్పింది. చట్టంలో లేని దాని గురించి, మేము ఏమి చెయ్యలేము అంటూ, పిటీషన్ కొట్టేసింది. దీంతో ఆళ్ళ ఖాతాలో మరో, అపజయం ఆడ్ అయ్యింది. నిజానికి, ‘సాధికారమిత్ర’ అనే వ్యవస్థ, గ్రామాల్లో ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి కుటుంబం నెలకు రూ.10 వేల ఆదాయం సంపాదించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకు స్వయం సహాయక సంఘాలను ఎన్నుకుంది. ఇందుకు ప్రత్యేకంగా ‘సాధికార మిత్ర’ వ్యవస్థను రూపొందించింది. స్వయం సహాయక సంఘాలలో సభ్యత్వంతో సంబంధంలేకుండా ప్రతి 35 కుటుంబాలు ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి, దానికి ఓ ‘సాధికార మిత్ర’ను నియమిస్తారు. వారు ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరిస్తారు. సేవే లక్ష్యంగా ముందుకు వచ్చేవారికి ‘సాధికారమిత్ర’లుగా అవకాశం కల్పిస్తారు. ఆ 35 కుటుంబాల బాధ్యత, ఆ ‘సాధికారమిత్ర’కు ఉంటుంది. అన్ని ప్రభుత్వ పధకాలు వారికి అందేలా, వీరు దగ్గర ఉండి పని చేస్తారు. అలాంటి ‘సాధికారమిత్ర’లని కూడా రద్దు చెయ్యమని, మన జగన్ పార్టీ అడుగుతుందంటే, వీరికి ప్రజల సమస్యల పై ఎంత గౌరవం ఉందో అర్ధమవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read