ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భద్రత పై, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. చంద్రబాబు అధికారం కోల్పోయిన వెంటనే, జగన్ ప్రభుత్వం చంద్రబాబు భద్రతను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే చంద్రబాబు కాన్వాయ్ లో కూడా, జామర్ తొలగించి, భద్రతని కూడా 1+1 కి తగ్గించారు. అయితే, ఈ విషయం పై చంద్రబాబు హైకోర్ట్ కు వెళ్లారు. ఈ విషయం పై గత నెల రోజులు పైగా వాదనలు జరిగాయి. తీర్పు రిజర్వ్ లో పెట్టారు. అయితే దీని పై ఈ రోజు హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. చంద్రబాబుకు 97 మందితో పూర్తీ భద్రత ఇవ్వాల్సిందే అనే కోర్ట్ స్పష్టం చేసింది. మొత్తం 97 మందితో భద్రత కొనసాగించాలని చెప్పటంతో, ప్రభుత్వ వాదన కోర్ట్ నమ్మలేదని చెప్పాలి. దీంతో ప్రభుత్వానికి హైకోర్ట్ లో చిక్కు ఎదురైంది.

cbn 14802019 2

97 మందితో భద్రత మాత్రమే కాకుండా, చంద్రబాబు కాన్వాయ్ లో, జామర్ కూడా పెట్టాలని హైకోర్ట్ స్పష్టం చేసింది. నిబంధనలు ప్రకారం మెడికల్ టీం కూడా ఇప్పటికే ఉంది. మరో పక్క, ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా, చంద్రబాబు సెక్యూరిటీలో ఉండాలని కోర్ట్ తెలిపింది. అయితే ఒక విషయంలో మాత్రం, కోర్ట్ క్లారిటీ ఇవ్వలేదు. చంద్రబాబుకి ఎన్‌ఎస్‌జీ భద్రత ఉన్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు క్లోజ్‌డ్‌ సెక్యూరిటీ అంటే, చంద్రబాబు బయట తిరిగే సమయంలో కాకుండా, క్లోజ్‌డ్‌ ఉన్నప్పుడు, ఎవరు సెక్యూరిటీ ఇవ్వాలి అనే అంశం పై వాదనలు నడిచాయి. ఎన్‌ఎస్‌జీ నిబంధనలు ప్రకారం, చంద్రబాబు బయట తిరిగే సమయంలో మాత్రమే వారు భద్రత ఇస్తారు. క్లోజ్‌డ్‌ సెక్యూరిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి.

cbn 14802019 3

క్లోజ్‌డ్‌ సెక్యూరిటీ పై రాష్ట్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదు అని చెప్పటంతో, హైకోర్ట్ కీలక ఆదేశాలు ఇచ్చింది. క్లోజ్‌డ్‌ సెక్యూరిటీ ఎవరు చూసుకోవాలి అనే అంశంపై ఎన్‌ఎస్‌జీ, స్టేట్‌ సెక్యూరిటీ మధ్య వచ్చిన ఇబ్బందిని, మూడు నెలల్లో ఓ నిర్ణయానికి రావాలని నిర్దేశించింది. అయితే అప్పటి వరకు ఎవరు చూస్తారు అనే దాని పై క్లారిటీ లేదు. లెక్క ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలి. ఇక మరో పక్క, దేశం అంతా, ప్రముఖులకు ఇస్తున్న సెక్యూరిటీ పై, గత నెలలో కేంద్రం రివ్యూ చేసి, ఆ సందర్భంలో కొంత మందికి ఎన్‌ఎస్‌జీ, ఎస్పీజీ భద్రత తొలగించినా, చంద్రబాబుకు ఉన్న సెక్యూరిటీ థ్రెట్ దృశ్యా, ఎన్‌ఎస్‌జీ భద్రత కొనసాగించిన సంగతి తెలిసిందే. ఇదే విషయం చంద్రబాబు లాయర్లు కోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు. మొత్తానికి చంద్రబాబుకు పూర్తీ భద్రత రావటంతో, తెలుగుదేశం శ్రేణులు సంతోషం వ్యక్తం చేసాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read