నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంలో రోజుకు ఒకటి చెప్తూ, గందరగోళానికి గురు చేస్తూ, ప్రభుత్వం నిర్ణయం ఏమిటో తెలియకుండా ఉన్న పరిస్థతి పై, పూర్తీ వివరాలు చెప్పండి అంటూ మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. మంత్రులతో పాటుగా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్‌డీఏ కమిషనర్‌, రాజధాని కమిటీ కన్వీనర్‌ జీఎన్‌ రావు, కమిటీ సభ్యులు అందరికీ హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. రాజధాని విషయంలో తాము నిపుణల కమిటీ వేశామని, ఆ కమిటీ నిర్ణయం ఆధారంగా నిర్ణయం ఉంటుంది అని ప్రభుత్వం చెప్తుంది. కమిటీ సభ్యులు అన్ని ప్రాంతాలకు వెళ్లి, అభిప్రాయలు తీసుకుంటున్నారు. మరో పక్క మంత్రులు మాత్రం, అమరావతి అక్కడ ఉండదు, అమరావతి ఓక కులానికి సంబంధించింది అని అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరో పక్క సచివాలయం, తాడేపల్లి పరిసర ప్రాంతాలకు వచ్చేస్తుంది అంటూ ప్రచారం జరుగుతంది.

court 15112019 2

ఈ గందరగోళ పరిస్థితిలో, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, కోర్ట్ కు వెళ్లారు. అసలు రాజధాని ఎప్పుడో నిర్ణయం అయిపొయింది అని, ఇప్పుడు వేసిన రాజధాని నిపుణుల కమిటీకి ఏ అధికారము లేదని, అమరావతి రైతులు, హైకోర్ట్ లో పిటీషన్ వేసారు. ఈ కమిటీని రద్దు చెయ్యాలని, హైకోర్ట్ ని కోరారు. కమిటీ ఏర్పాటుకు సంబంధించి సెప్టెంబరు 13న రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 585ను రద్దు చెయ్యాలని, వీరు హైకోర్ట్ ని కోరారు. ఈ కమిటీ ఏర్పాటు, ఏపీసీఆర్‌డీఏ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఏర్పడిందని అన్నారు. ఏపీసీఆర్‌డీఏ చట్టం ప్రకారం, రజధాని పునఃపరిశీలించే అధికారం ఈ నిపుణల కమిటీకి లేదని, దీన్ని వెంటనే రద్దు చెయ్యాలని హైకోర్ట్ ని కోరగా, హైకోర్ట్ ఈ పిటీషను విచారణకు స్వీకరించి, అందరికీ నోటీసులు జరీ చేసింది.

court 15112019 3

రాజధాని పునఃసమీక్ష కోసం, ఆ కమిటీ ఎందుకు వేసారు, తదితర అంశాల పై, మీ వైఖరి చెప్పండి అంటూ, అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి కూడా హైకోర్ట్ నోటీసులు ఇచ్చింది. ఈ కేసు విచారణను, నవంబర్ 28కి వాయిదా వేసింది. పిటీషనర్ తరుపున న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్‌ హైకోర్టుకు వాదనలు వినిపిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని కోర్ట్ కు చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ అనేక సార్లు పొంతనలేని వివాదాస్పద ప్రకటనలు చేశారని చెప్పారు. ఇవి మీడియాలో వచ్చి గందరగోళానికి తెర లేపాయని అన్నారు. మరో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇప్పటికే అమరావతిలో ఉన్న హైకోర్టు తరలింపు పై వ్యాఖ్యలు చేసారని, తరువాత న్యాయవాదులు అందరూ గందరగోళానికి గురయ్యిం, ఆందోళన చెయ్యాల్సి వచ్చిందని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read