ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని, హైకోర్టు అభిప్రాయ పడింది. రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించటం లేదని, ఈ నేపధ్యంలో రోజు వారీ కార్యక్రమాలు చేయటంలో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి, ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టుని ఆశ్రయించింది. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చెయ్యల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలు చేయటంతో, ఆ కౌంటర్ ని పరిశీలించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ తీరు పైన తీవ్ర స్థాయిలో మండి పడింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ గా ఉన్న వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేకపోయినా తొలగించారు. తొలగించిన వ్యక్తిని న్యాయబద్ధంగా మళ్ళీ హైకోర్టు తిరిగి పదవిలో పెట్టింది. అలా తిరిగి పదవిలోకి వచ్చిన వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సహకరించటం లేదని, హైకోర్టు చాలా స్పష్టంగా వ్యాఖ్యానించింది. ఈ వైఖరి సరి కాదని హైకోర్టు చెప్పింది. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయని, కానీ రాజ్యాంగ బద్ధ సంస్థలు మాత్రమే అలాగే ఉంటాయని, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అలాంటిదే అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ రాజ్యాంగబద్ధ సంస్థలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉంటుందని, రాజ్యాంగాబద్ధ సంస్థలను కాపడుకున్నప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందనే విషయం గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు హితవు పలికింది.

kanakaraj 03112020 2

ఇక ఎన్నికల కమిషన్ కు సంబంధించి, తమ అవసరాలు ఏమిటి అనేవి సమగ్రమైన నివేదికను, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని, ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో నిమ్మగడ్డను తొలగించి , రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన జస్టిస్ కనకరాజ్ అని వ్యక్తి పై కూడా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ కనకరాజ్ కు సంబంధించి, ఆయన తరుపున చేసిన న్యాయ ఖర్చు కానీ, ఇతర లీగల్ ఖర్చు కానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలాంటి చెల్లింపులు జరపకూడదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ, ఎలక్షన్ కమిషన్ ఈ విషయం పై ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. తన న్యాయ పరమైన హక్కుల కోసం జస్టిస్ కనకరాజ్ చేసిన ఖర్చులు, అలాగే ఆయన నివాసానికి ఇతర ఖర్చులకు, అతని వ్యక్తిగతమైనవిగా భావించాలని, దీనికి ఎన్నికల కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదని, హైకోర్ట్ తెలిపింది. వీటి అన్నిటి పై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో జస్టిస్ కనకరాజ్ ఎన్నికల కమీషనర్ హోదాలో చూపిస్తున్న ఖర్చులు ఏమి, రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి చెల్లించాల్సిన పని ఉండదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read