రాష్ట్ర సచివాలయం నుంచి విజిలెన్స్ కార్యాలయాల తరలింపునకు సంబంధించి జీవో నంబరు 13ను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై త్రిసభ్య ధర్మాసనం ముందు మంగళవారం వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. "ప్రభుత్వ ఉత్తర్వు అంటే దానిలో పూర్తి వివరాలు ఉండాలి. వేరే దానితో కలిపి చదవాల్సిన అవసరం ఉండకూడదు. విజిలెన్స్ కార్యాలయం తరలింపు జీవో రూపకల్పనలో మీరు ఆ విధమైన మార్గదర్శకాలు పాటించారు? నోట్ ఫైల్ నేరుగా ముఖ్యమంత్రి ఎలా ఇస్తారు" అని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం అడ్వకేట్ జనరలను ప్రశ్నించింది. రాజధాని పరిధిలోని తాళ్ళాయపాలెం గ్రామానికి చెందిన కొండేపాటి గిరిధర్ అనే రైతు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. జీవోలో అన్ని విషయాలు నేరుగా ప్రస్తావించాలని ఎంఎస్ గిల్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఇంద్రనీల్ బాబు ధర్మాసనం ముందు ఉదాహరించారు. దానిపై ధర్మాసనం స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేసింది. తొలుత అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదిస్తూ విజిలెన్స్ కార్యాలయం సాధారణ పరిపాలనా విభాగంలో అంతర్భాగం కాదని, దానిని ప్రాంతానికి తరలించటం వల్ల ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలుగదని పేర్కొన్నారు. .

సచివాలయంలో చాలినంత జాగా లేనందువల్లనే ఆ కార్యాలయాన్ని కర్నూలుకు మార్చాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చారు ? ఏ కారణాలతో వచ్చారు, ఆ ప్రాసెస్ అంతా ఇవ్వండి అని హైకోర్ట్ అడిగిన ప్రశ్నకు, ముఖ్యమంత్రికి కూడా జీవో పాస్ చేసే అధికారం ఉంటుంది చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే, జీవో ఇచ్చారు అని చెప్పటంతో, ఇది సరైన వాదన కాదని, తేలి పోయింది అనే అభిప్రాయం కలుగుతుంది. మరో పక్క, జీవోలో పాలనాపరమైన కారణాలు అని పేర్కొన్నారని, వాటిని ఎందుకు ప్రస్తావించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. నోట్ ఫైల్ పై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంతకం లేకపోవటం, ఎవరు ప్రతిపాదించినది ప్రస్తావన లేకపోవటం, జీవోలో కారణాల గురించి వివరించకపోవటం, డైరెక్ట్ గా సియం చెప్పారు అని చెప్పటం తదితర కారణాల వల్ల ప్రభుత్వ చర్య దురుద్దేశపూరితంగా ఉందన్న అనుమానానికి ఆస్కారం ఏర్పడుతుందని పిటీషనర్ తరపు న్యాయవాది ఇంద్రనీల్ పేర్కొన్నారు.

విజిలెన్స్ కార్యాలయం తరలించటం వల్ల అత్యంత ప్రధానమైన సచివాలయ కార్యకలాపాలలో పారదర్శకత లోపించే ప్రమాదముందని ఆయనన్నారు. స్థలాభావంతో కార్యాలయాల్ని కర్నూలుకు తరలిస్తున్నట్లు నోట్‌ఫైల్స్‌లో ప్రస్తావించలేదన్నారు. కర్నూలుకు కార్యాలయాల తరలింపు విషయంలో, ఆ శాఖ నుంచి ఏ ప్రతిపాదన లేకుండానే, ముఖ్యమంత్రి ఫైల్‌ను ముందుకు పంపినట్లు తెలుస్తుందని హైకోర్ట్ వ్యాఖ్యానించింది. ఎక్కడైనా స్థలం సరి పోక పొతే, దగ్గరలే వేరేది చూస్తాం కాని, ఎక్కడో కర్నూల్ కు వెళ్ళటం ఏమిటని కోర్ట్ ప్రశ్నించింది. మరో పక్క ఈ విషయాల పై ప్రస్తావిస్తూ, కేంద్ర ప్రభుత్వం ముఖ్య పర్సన్‌.. కానీ మౌనంగా ఉంటోందని కోర్ట్ కేంద్రం పై వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేసులో విచారణ ముగిసినట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read