అటు ప్రభుత్వం, ఇటు కోర్ట్ ల మధ్యలో అధికారులు నలిగిపోతున్నారు. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, ఈ విషయం పై, ఇప్పటికే హెచ్చరించారు కూడా. ఏ నిర్ణయం అమలు చేసినా, జగన్ మోహన్ రెడ్డికి ఏమి అవ్వదు, అధికారులే బాధ్యత తీసుకోవాలి అంటూ, ఆయన ఇప్పటికే అనేక సార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇది నిజం అని ఇప్పుడు తేలుతుంది కూడా. పంచాయతీ ఆఫీస్ కి వైసీపీ రంగుల విషయంలో, అధికారులనే కోర్ట్ తప్పు బట్టింది. అలాగే, ఒక రేషన్ డీలర్ ని అకారణంగా రద్దు చేసిన విషయంలో కూడా అధికారులనే కోర్ట్ బాధ్యులను చేసింది. అలాగే కృష్ణ కిషోర్ కు జీతం ఇవ్వకుండా ఆపటం పై, క్యాట్ ట్రిబ్యునల్, చీఫ్ సెక్రటరీ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్నటి మొన్న, డీజీపీ ఒక కేసు విషయంలో, హైకోర్ట్ కు వచ్చి సమాధానం చెప్పే పరిస్థితి వచ్చింది. ఇలా ప్రతి విషయంలో, వెనుక వైసీపీ ప్రభుత్వం ఉన్నా, దానికి బాధ్యులు మాత్రం, అధికారులే అవుతున్నారు. ఇప్పుడు తాజాగా విధ్యత్ బకాయల విషయంలో, మళ్ళీ అధికారులనే తప్ప బట్టింది హైకోర్ట్.

court 2002020 2

సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి, వైరం ఏర్పడింది. సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి కంపెనీల పై కక్ష కట్టి, వాటి ఒప్పందాలు సమీక్షిస్తాం అని చెప్పటం, అలాగే తక్కువ రేటుకు ఇవ్వాలని ఒత్తిడి చెయ్యటం, వారు కోర్ట్ కు వెళ్ళటం, వారికి ఇవ్వాల్సిన బకాయాలు ఆపేయటం, వారి నుంచి విద్యుత్ కొనకపోవటం, ఇలా రకరకాలుగా వారిని ఇబ్బంది పెడుతూ వచ్చింది జగన్ ప్రభుత్వం. ఈ నేపధ్యంలోనే, తమకు ఇవ్వాల్సిన బకాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పించాలి అంటూ వారు కోర్ట్ కు వెళ్లారు. దీంతో, హైకోర్ట్, వారి బకాయాలు వెంటనే ఇవ్వాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది. కోర్ట్ ఆదేశాలు తప్పక పాటించాల్సి రావటంతో, కొంత మేర ప్రభుత్వం చెల్లింపులు చెల్లించింది.

court 2002020 3

అయితే మిగతా బకాయిలు, 4 వారాల్లో చెల్లిస్తాం అని హామీ ఇచ్చారు. అయితే, 4 వారలు అయినా చెల్లింపులు చెల్లించకపోవటంతో, కోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయాలు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించింది. మీ మీద కోర్ట్ ధిక్కరణ ప్రక్రియ ప్రారంభించి, ఎవరయితే బాధ్యులు అయిన అధికారులు ఉన్నారో, వారిని జైలుకు పంపుతాం అంటూ హైకోర్ట్ తీవ్రంగా హెచ్చరించింది. ఏ సంస్థకు ఎంత ఇచ్చారు, ఇంకా ఎంత ఇవ్వాలి అంటూ, తమకు కౌంటర్ దాఖలు చెయ్యాలని కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో, కోర్ట్ కు ఇచ్చిన హమీ మేరకు, తాము చెల్లింపులు చెయ్యలేదని, క్షమాపణలు కోరుతున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్‌, ఏపీఈపీడీసీఎల్‌ తరఫున ఎస్పీడీసీఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజరు హైకోర్ట్ లో అఫిడవిట్ వేసారు. మొత్తంగా, ప్రభుత్వ పెద్దల పంతానికి, ఇప్పుడు అధికారులు బోనులో నుంచోవాల్సి వచ్చింది. చూద్దాం, ఇది ఎక్కడి వరకు వెళ్తుందో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read