ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనకు సంబంధించి కౌంటర్ దాఖలకు హైకోర్టు ధర్మాసనం వారం రోజులు గడువిచ్చింది. గడువు లోగా కౌంటర్ దాఖలు చేయని పక్షంలో, తామిక వాదన వినమని, విద్యాశాఖ ఉన్నతాధికారి స్వయంగా కోర్టుకు హాజరు కావలసి ఉంటుందని హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. కౌంటర్ దాఖలు చేయటంలో ఇంత జాప్యం ఎందుకు జరుగుతోందని ధర్మాసనం అడ్వకేట్ జనరలను ప్రశ్నించింది. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనను ప్రవేశపెడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తర పున ప్రముఖ హైకోర్టు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జిస్టిక్స్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ ఎన్ జయసూర్యలతో కూడిన ధర్మాసనం పిల్ పై సోమవారం విచారణ జరి పింది. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతున్నందున దానిని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది ఇంద్రనీల్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు.

highcourt 28012020 2

“ఈ విషయంలో తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ముందుకు వెళ్లవద్దని న్యాయస్థానం ఇంతకు ముందే ఆదేశించింది. ఒకవేళ ముందుకు వెళితే సీబీఐ విచారణకు ఆదేశిస్తాం. అందుకు బాధ్యలు ఎవరు? దానిపై ఎంత వ్యయం చేశారు? తదితర అంశాలన్నీ బయటకు లాగుతాం. బాధ్యులపై చర్యలు తీసుకోవటంతో పాటు ప్రతి రూపాయి వెనక్కి రప్పిస్తాం " అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగానే వున్నదని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కృష్ణమోహన్ ధర్మాసనం ముందు స్పష్టం చేశారు. జాతీయ విద్యావిధానం ప్రకారం బోధనా మాధ్యమం మాతృ భాష లోనే ఉండాలని ఆయన పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు ఇదే విధానాన్ని అవలంభిస్తున్నాయని కృష్ణమోహన్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

highcourt 28012020 3

దానిపై అడ్వకేట్ జనరలను ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ ఉత్వ ర్వులు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగానే వున్నాయని, కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ ధర్మ సనాన్ని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం కేసును ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంలో 'ఇంప్లీడ్ ' అయ్యేందుకు ప్రముఖ సీనియర్ న్యాయవాదులు సైతం ఆసక్తి కనబరుస్తుండటం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇక ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనకు సంబం ధించి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల, తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని పాఠశాల విద్యా కమిటీల ద్వారా ఈ మేరకు అభిప్రాయాలు సేకరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read