గత 26 రోజుల్లో అమరావతిలో పరిస్థితి ఎలా ఉందొ అందరికీ తెలిసిందే. 26 రోజులుగా, అమరావతిలో రైతులు శాంతియుతంగా నిరస-నలు చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే, ప్రభుత్వం, పోలీసులు మాత్రం, వాళ్ళు శాంతియుతంగా నిరస-నలు చెప్తున్నా, రైతులని మాత్రం, బయటకు రానివ్వటం లేదు. బయటకు వస్తుంటే, ముళ్ళ కం-చెలు వేస్తున్నారు. కొడుతున్నారు. అరె-స్ట్ లు చేస్తున్నారు. ఇలా అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో ఇప్పటికే ఢిల్లీ నుంచి జాతీయ మహిళా కమిషన్ వచ్చి, నిన్న అమరావతి, విజయవాడలో పర్యటించింది. అలాగే నేషనల్ మీడియాలో కూడా, అమరావతిలో పోలీసులు, ప్రభుత్వం చేస్తున్న హడావిడి పై, వ్యతిరేకత వస్తుంది. మరో పక్క, ఇప్పటికే సుప్రీం కోర్ట్ కూడా, దేశంలో అనవసరంగా 1-4-4 సెక్షన్ ఎందుకు పెడుతున్నారు, ఇది ప్రజల ప్రాధమిక హక్కుని హరించటమే అంటూ సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది. ఈ నేపధ్యంలోనే, అమరావతిలో జరుగుతున్న పరిణామాల పై హైకోర్ట్ సుమోటోగా తీసుకుంది. అంతే కాకుండా కొంత మంది రైతులు పిటీషన్ కూడా వేసారు.

court 13012020 2

వీటి అన్నిటి పై విచారణ చేసిన హైకోర్ట్, తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. అమరావతిలో పరిస్థితి పై హైకోర్ట్ సీరియస్ అయ్యింది. అమరావతిలో ఏమి జరుగుతుందో అర్ధం కావటం లేదు అంటూ హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గ్రామాల్లోకి వచ్చి, పోలీసులు మార్చ్ చెయ్యటం ఏమిటి, అక్కడ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటూ ప్రశ్నించింది. రాజధాని గ్రామాల్లో, కర్ఫ్యూ వాతావరణం ఎందుకు పెట్టారు అంటూ, హైకోర్టు నిలదీసింది. ఇదే సందర్భంలో, పిటీషన్ వేసిన వారు కూడా, అక్కడ పరిస్థితిని హైకోర్ట్ దృష్టికి తీసుకువచ్చారు. ఆడవారిని కూడా బయటకు రానివ్వటం లేదని, వారి పై కూడా దాడులు చేస్తున్నారని, రాజధాని తరలింపు పై శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా, అనుమతులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని కోర్ట్ దృష్టికి తీసుకు వచ్చారు.

court 13012020 3

అలాగే, వీడియోలను కూడా కోర్ట్ కు చూపించారు. మా ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉంది, రాజధాని గ్రామాలని రక్షించండి అంటూ కోర్ట్ లో వేడుకున్నారు. దీని పై ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ వాడనలు వినిపిస్తూ, ఈ కేసుని సోమవారానికి వాయిదా వెయ్యాలని కోరారు. అయితే దానికి కోర్ట్ ఒప్పుకోలేదు. దీని పై త్వరగా విచారణ జరపాల్సిన పరిస్థితి ఉందని, పూర్తీ వివరాలతో మాకు శుక్రవారం లోపు అఫ్ఫిదవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే హైకోర్ట్ లో సెలవులు ఉన్నా, హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. రాజధాని గ్రామాల్లో 1-4-4 సెక్షన్‌, పోలీస్‌ యాక్టు 3-0 అమలును సవాల్‌ చేస్తూ కొంత మంది రైతులు పిటీషన్ వెయ్యగా, హైకోర్ట్ మహిళల పై దౌర్జన్యాన్ని, సుమోటోగా తీసుకుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read