“విజిలెన్స్ కార్యాలయం లేకుండా సచివాలయం ఎలా పనిచేస్తుంది ? ఆ శాఖలో ఎంత మంది పనిచేస్తున్నారు ? వారి హోదాలు ఏమిటి ? వారి విధులు, వేతనాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వండి " అని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దానిపై ప్రిన్సిపల్ సెక్రెటరీ స్థాయి అధికారితో అఫిడవిట్ సమర్పించాలని అడ్వకేట్ జనరల్ కు ధర్మాసనం సూచించింది. రాష్ట్ర సచివాలయం నుంచి విజిలెన్స కార్యాలయాన్నితరలిస్తూ జారీ చేసిన జీవో వ్యవహరం రోజుకో మలుపు తిరుగుతోంది. దీనిపై రాష్ట్ర హైకోర్టులో - దాఖ లైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ శేషసాయి, జసిస్ట్ సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం బుధ వారం విచారణ జరిపింది. ధర్మాసనం కోరిన వివరాలు సమర్పించేందుకు అడ్వకేట్ జనరల్ గడువు కోరటంతో విచారణను 18వ తేదీకి వాయిదా వేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 13ను సవాల్ చేస్తూ కొండేపాటి గిరిధర్, మరికొంత మంది వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.

హైకోర్టులో విచారణ సందర్భంగా బుధవారం పిటీషనర్లు కోరిన పలు అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చింది. గిరిధర్ తరపు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదిస్తూ సచివాలయం లో అంతర్భాగంగా ఉన్న విజిలెన్స్ కార్యాలయాన్ని తరలించకుండా చూడాలని కోరారు. ధర్మాసనం ప్రధానంగా దానిపైనే దృష్టిసారించింది. కార్యాలయం తరలింపుకు సంబంధించి అడ్వకేట్ జనరల్ శ్రీరాం వివరణ ఇచ్చారు. “గత ప్రభుత్వం హయాంలో సలహదారులు తొమ్మిదిమంది ఉన్నారు. ప్రస్తుతం వారి సంఖ్య 40కి చేరుకుంది. అందరికి కేబినెట్ హోదా ఇవ్వటంతో నిబంధనల ప్రకారం వారందరికి పేషీలు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో సచివాలయంలో జాగా సరిపోవటం లేదు " అని అడ్వకేట్ జనరల్ వివరించారు.

జాగా సరిపోని పక్షంలో పక్కనే వేరొకటి నిర్మించుకోవచ్చు కదా ? అని ధర్మాసనం ప్రశ్నించింది. కార్యాలయాన్ని పూర్తిగా తరలించటం లేదని, కేవలం కమీషనర్, దానికి అనుబంధంగా ఉండే ఉద్యోగులను మాత్రమే తరలిస్తున్నట్టు అడ్వకేట్ జనరల్ చెప్పారు. అసలు విజిలెన్స్ కార్యాలయంలో ఉద్యోగులు ఎంతమంది వున్నారు ? వారి హోదా, విధులు, వేతనాలకు సంబంధించి పూర్తి వివరాలు రేపటికల్లా తీసుకురండి అని ధర్మాసనం అడ్వకేట్ జనరలను సూచించింది. అయితే ప్రిన్సిపాల్ సెక్రటరీ అందుబాటులో లేనందున క్రిందిస్థాయి అధికారితో అఫిడవిట్ తీసుకురాగలనని అడ్వకేట్ జనరల్ చెప్పారు. అందుకు ధర్మాసనం అంగీకరించలేదు. ప్రిన్సిపాల్ సెక్రెటరీ సాయి అధికారితోనే సంతకం చేయించి తీసుకురావాలని ఆదేశించింది. అడ్వకేట్ జనరల్ గడువు కోరటంతో కేసును 18వ తేదీకి వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read