ఎన్టీఆర్ భరోసా పథకం కింద వికలాంగ పింఛను పొందడం ఎలాగో తెలియక ఆయోమయంలో ఉన్నారా! అయితే ఇప్పుడిక దరఖాస్తు ఎలా చేసుకోవాలో తెలుసుకోండి. ఆ తర్వాత పింఛను పొందడి.

  • సదరన్ సర్టిఫికేట్ తప్పనసరి
  • వికలాంగత్యం నిర్ధారించేందుకు నిర్వహించే సదరన్ క్యాంప్కు వెళ్లి అక్కడ వైద్యులతో పరీక్షలు చేయించుకుని వికలాంగ ధృవ పత్రం పొందాలి.
  • ముందుగా ఆ మండలానికి చెందిన ఎంపీడీవో వద్ద ఉన్న ఫారం పూర్తి చేయాలి. ఎంపీడీవో సంతకం పెట్టాకే సదరన్ క్యాంపుకు వెళ్లాలి.
  • వికలాంగుల ధ్రువీకరణ పత్రం సదరన్ క్యాంప్ వారు చేతికి ఇవ్వకుండా అభ్యర్థులున్న ప్రాంతాల్లోని మండల పరిషత్ కార్యా లయాలకే పంపుతారు.
  • కృష్ణా జిల్లాలో అయితే మచిలీపట్నం జిల్లా ప్రభుత్యాస్పత్రిలో ప్రతి మంగళవారం, విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ లో ప్రతి శుక్ర వారం సదరన్ క్యాంప్లు జరుగుతాయి.
  • మానసిక వికలాంగులకు సంబంధించి గుడివాడ, విజయవాడ డివిజనుల ప్రజలకు విజయవాడలో శుక్రవారం పరీక్షలు చేస్తారు.
  • మూడేళ్ల వయస్సు పైబడిన వికలాంగులు ఎవరైనా పింఛనుకు అర్జులే. కనీసం 40శాతం వికలాంగత్వం ఉంటేనే పింఛను వచ్చే అవ కాశం ఉంటుంది.
  • ఆ ధృవపత్రం వచ్చాక మండల పరిషత్ కార్యాలయం సుంచి పింఛను దరఖాస్తుకు ఆన్లైన్ లో పెడతారు.
  • ఒక ఇంట్లో వికలాంగ పింఛను ఉన్నా మరొకరికి వికలాంగత్యం ఉన్నా వారికీ కూడా పింఛను వస్తుంది.
  • 40 నుంచి 80 శాతం వరకు వికలాంగత్యం ఉన్న పింఛనుదారునకు రూ.1,000...వంద శాతం వికలాంగత్యం ఉన్న వారికి రూ.1500 పింఛను ప్రభుత్వం ఇస్తుంది...
Advertisements

Advertisements

Latest Articles

Most Read