కోర్ట్ తీర్పు అమలు చేయడం లో జాప్యం చేసిన కారణంగా ఐఏఎస్ అధికారి చిన్న వీరభద్రుడికి నాలుగు వారాల సాధారణ జైలు శిక్ష ,రెండు వేల రూపాయల జరిమానా హైకోర్ట్ విదించింది. అయితే ఈ తీర్పు అమలుకు సంభందించి ,అమలు రెండు వారాల పాటు నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారి చేసింది. ఈ కేసు వివరాల ప్రకారం జివో నంబర్ 342 ప్రకారం SC, ST సంబంధించిన సెకండ్ గ్రేడ్ టీచర్లకు ,ప్రమోషన్ కోసం BPED కోర్సులు తీసుకునే వెసులుబాటు ఉంది . అయితే BPED కోర్సులు అభ్యసించే టైమ్ లో SC, ST సంబంధించిన సెకండ్ గ్రేడ్ టీచర్లకు పూర్తి స్థాయిలో జీతాలు ఇస్తారు. అయితే తరువాత ప్రభుత్వం కొన్ని సవరణలు చేస్తూ వాళ్లకు జీత భత్యాలు చెల్లించే వెసులుబాటును తీసివేసింది. ఈ నేపధ్యంలో విజయనగరానికి చెందిన నలుగురు సెకండ్ గ్రేడ్ టీచర్లు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్ట్ ను ఆశ్రయించింది. హైకోర్ట్ ఈ కేసుకు సంభందించి పోయిన సంవత్సరం మార్చి నెలలో తీర్పును ఇచ్చింది. జివో నంబర్ 342 యధాతధంగా అమలుచేయాలని ,దీనికి సంబంధించి ,ప్రభుత్వం చేసిన సవరణలు చెల్లవని స్పష్టం చేసింది. హైకోర్ట్ వెంటనే జివో నంబర్ 342 అమలు చేస్తూ BPED కోర్సులు చేస్తున్న సెకండ్ గ్రేడ్ టీచర్లకు పూర్తి స్థాయి జీతభత్యాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

hc 030502022 2

అయితే ఈ ఆదేశాలు అమలు చేయడంలో ఈ అధికారులు సుధీర్గ జాప్యం చేసారు. ఈ జాప్యాన్ని సవాలు చేస్తూ కోర్ట్ దిక్కరణ పిటీషన్ దాఖలు చేయడం తో ఈ కేసు పూర్వ పరాలను పరిశీలించి , ముగ్గురు ప్రభుత్వ అధికారులు కోర్ట్ దిక్కరణ చేసారని కేసు నమోదయింది. ఈ కేసులో ఇద్దరు అధికారులకు మినహాయింపు ఇచ్చారు. కాని IAS అధికారి చిన్న వీరభద్రుడికి మాత్రం నాలుగు వారాల సాధారణ జైలు శిక్ష ,రెండు వేల రూపాయల జరిమానా హైకోర్ట్ విదించింది. అయతే చిన్న వీరభద్రుడి తరుపున న్యాయవాది దీనికి సంభందించిన అప్పీలు కోసం శిక్షను నిలుపుదల చేయాల్సిందిగా కోరడంతో, శిక్షను రెండు వారాల పాటు నిలుపుదల చేస్తూ హైకోర్ట్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. వరుస పెట్టి అధికారులు ఇలా కోర్టులో, కోర్టు ధిక్కరణ కేసులు కింద, బుక్ అవ్వటం, ఈ మద్య కాలంలో చూస్తున్నాం. నెల రోజుల క్రిందట ఏకంగా ఎనిమిది మంది ఐఏఎస్ ఆఫీసర్ల పైన, కోర్టు ధిక్కరణ కేసు నమోదు అయ్యి, వారికి సేవా శిక్ష కూడా కోర్టు విధించిన సంగతి తెలిసిందే.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read