అమరావతిని, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించిన దగ్గర నుంచి, అనేక ప్రచారాలతో, అమరావతి పై నెగటివ్ ప్రచారం చేస్తూ వచ్చారు. ఒక పక్క అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అమరావతిని రాష్ట్రంలో అందరికీ కనెక్ట్ అయ్యేలా, అన్ని గ్రామాల నుంచి నీరు, మట్టి తీసుకువచ్చారు. అలాగే 10 రూపాయలకు ఇటుకు పెట్టి, అందరినీ భాగస్వామ్యం చేసారు. అమరావతి అందరిదీ అనే భావం తీసుకువచ్చారు. అయితే అప్పటి ప్రతిపక్షం వైసీపీ మాత్రం, అమరావతిని, మిగతా జిల్లాల ప్రజలకు దూరం చేసే కార్యక్రమాలు చేసింది. ఇందులో భాగంగా అనేక ప్రచారాలు చేసారు. ముందుగా రైతులను భూములు ఇవ్వకుండా, ప్రయత్నాలు చేసినా, రైతులు మాత్రం వీళ్ళ మాట వినలేదు. దీంతో 33 వేల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి. దీంతో అమరావతిలో పనులు మొదలయ్యాయి. రోడ్లు వేసారు, బిల్డింగ్ లు కడుతున్నారు, రైతులకు ప్లాట్లు ఇచ్చారు. ఇలా అమరావతి ముందుకు సాగుతూ ఉన్న సమయంలో, ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారి పోవటం జరిగిపోయాయి.

amaravati 16012020 2

ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం, అమరావతిని ఇక్కడ నుంచి తీసుకు వెళ్ళే ప్రయత్నంలో భాగంగా, అనేక ప్రచారాలు మొదలు పెట్టింది. అమరావతి ఒకే కులానికి సంబంధించింది అని ప్రచారం చేసారు. అయితే అది ఎస్సీ రిజర్వాడు నియోజకవర్గం. ఇక మరో ప్రచారం, అమరావతి కొంత మంది పెద్ద రైతులది అని. అయితే, 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులలో, 20490 మంది, ఒక ఎకరం కన్నా తక్కువ ఉన్నవారు. దీంతో ఈ ప్రచారం కూడా తుస్సు మంది. తరువాత, అమరావతి కోసం, 33 వేల ఎకరాలు ఎందుకు ? అనే ప్రచారం. అయితే జగనే 30 వేల ఎకరాలు కావాలి అని చెప్పే వీడియో రావటంతో, ఇది కూడా తుస్సు మంది. ఇక తరువాత అమరావతి గ్రాఫిక్స్. అయితే ఇది కూడా అక్కడ బిల్డింగ్ లు చూపించి తిప్పి కొట్టారు.

amaravati 16012020 3

మరో ప్రచారం, అమరావతికి లక్ష కోట్లు అని. కాని ఇది సెల్ఫ్ ఫైనాన్సు ప్రాజెక్ట్ అని లెక్కలతో చెప్పటంతో, ఇది కూడా పోయింది. అమరావతికి వరదలు అన్నారు, దీనికి ఎన్జీటీ తీర్పు రావటంతో, ఇదీ తుస్సు మంది. చివరగా, అమరావతి నిర్మాణాలకు ఖర్చు ఎక్కువ అవుతుందని , ఐఐటీ మద్రాస్ దీనికి సంబంధించి ఒక నివేదిక కూడా ఇచ్చిందని, ప్రచారం మొదలు పెట్టరు. అయితే ఐఐటీ మద్రాస్ అలాంటి నివేదిక ఏమి ఇచ్చిన దాఖలాలు లేకపోవటంతో, కొంత మందికి అనుమానం వచ్చి, ఐఐటీ మద్రాస్ కు మెయిల్ పంపించారు. దీనికి స్పందించిన ఐఐటీ మద్రాస్‌, అలాంటి నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేస్తూ ఐఐటీ మద్రాస్‌ రిప్లయ్‌ ఇచ్చింది. దీంతో అమరావతి పై, చేసిన మరో విష ప్రచారం కూడా తప్పు అని తేలిపోయింది. ఐఐటీ మద్రాస్ అంటూ చెప్తున్న రిపోర్ట్ , అబద్ధమని తేలిపోయింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read