వైఎస్ జ‌గ‌న్ రెడ్డికి ఆయువుప‌ట్టులాంటి ఆర్థిక సామ్రాజ్యాధినేత‌లు ఒక్కొక్క‌రూ ఊచ‌లు లెక్క పెట్టేందుకు క్యూ కడుతున్నారు. జ‌గ‌న్ రెడ్డి అక్ర‌మాస్తుల కేసుల్లో స‌హ‌నిందితుడైన‌ అర‌బిందో శ‌ర‌త్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్క‌ర్ కేసులో అరెస్ట‌యి, చివ‌రికి జ‌గ‌న్ చొర‌వ‌తో అప్రూవ‌ర్‌గా మారి బెయిల్ పై బ‌య‌ట‌కొచ్చాడు. ఇదే కేసులో వైసీపీ ఎంపీ త‌న‌యుడు మాగుంట రాఘ‌వ‌రెడ్డి అరెస్ట‌య్యాడు. చీక‌టి వ్యాపారాలు చేస్తూ, జ‌గ‌న్ రెడ్డికి ఆర్థిక అండ‌దండ‌లు అందిస్తార‌నే ప్ర‌చారంలో వున్న ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవ‌ర్ హత్య‌కేసులో అరెస్ట‌యి బెయిల్ పై బ‌య‌ట‌కొచ్చారు. వైఎస్ జ‌గ‌న్ రెడ్డి కోసం మీడియా ప్ర‌మాణాలు కూడా పాటించ‌కుండా అడ్డ‌గోలు క‌థ‌నాలు అచ్చోసి వ‌దిలేసే డెక్కన్ క్రానికల్ వెంకట్రామ్ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. రూ.8వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఈడీ అభియోగాలు మోపి గతంలో రూ.264 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులో డెక్కన్ క్రానికల్ కు చెందిన 14 ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. డెక్కన్ క్రానికల్ స్కామ్ పై ఈడీ ఆరు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసింది. ఈ కేసులోనే వెంక‌ట్రామిరెడ్డిని అరెస్ట్ చేసింది. జ‌గ‌న్ తో ఇటీవ‌ల భేటీ అయి ఒప్పందాలు కూడా చేసుకున్న బైజూస్ ర‌వీంద్ర‌న్ పైనా ఈడీ కేసు న‌మోదు చేసింది. వైఎస్ జ‌గ‌న్ రెడ్డి అత‌ని బంధువుల‌కి అత్యంత స‌న్నిహితుడైన సేఫ్‌ ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ శనగల శ్రీధర్‌ రెడ్డిని ముంబై కస్టమ్స్‌ అధికారులు రట్టు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన రూ.21 కోట్ల విలువైన ట్రమాడాల్‌ ట్యాబ్లెట్లను సూడాన్‌లో స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విచారణ చేసిన కస్టమ్స్‌ అధికారులు.. మన రాష్ట్రానికి చెందిన సేఫ్‌ ఫార్మా కంపెనీ కంపెనీ డైరెక్టర్‌ శనగల శ్రీధర్‌ రెడ్డిని అరెస్టు చేశారు. ఈ సేఫ్ ఫార్మాతో వైసీపీలో పెద్ద‌ల‌కి సంబంధాలున్నాయ‌నే ప్ర‌చారం ఉంది. మొత్తానికి జ‌గ‌న్ రెడ్డియే కాదు, ఆయ‌న చుట్టూ ఉన్న‌వారు, ఆయ‌న‌తో ఒప్పందాలు చేసుకున్న వారూ ఏదో ఒక కేసులో అరెస్టు అవుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read