ప్రజారాజధాని అమరావతిని ముక్కలుచేయడానికి కుట్రలు పన్నిన ముఖ్యమంత్రి ఇన్ సైడింగ్ ట్రేడింగ్ అంటూ పెద్దఎత్తున దుష్ప్రచారం చేస్తూ, సీబీసీఐడీ, ఏసీబీలను తనజేబు సంస్థలుగా మార్చుకొని, అనేకమందిపై తప్పుడుకేసులు పెడుతున్నాడని, రాజధాని ప్రాంతవాసులంటే జగన్ కు ఎందుకంత నిర్ధయ అని, టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రశ్నిం చారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్ తన అధికారయంత్రాంగాన్ని ఉపయోగించి, ప్రతిపక్షనేత చంద్రబాబుపై అసత్య ఆరోపణలుచేస్తున్నాడని, ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారమంతా కేవలం కట్టుకథలేనని నేడు హైకోర్టు తీర్పుతో తేలిపోయిందన్నారు. కిలారిరాజేశ్ అనేవ్యక్తికి రాజధానిప్రాంతంలో 40సెంట్ల పొలముంటే, ప్రభుత్వం ఆయనపై అక్రమంగా కేసుపెట్టింద న్నారు. ప్రభుత్వ తీరుకి నిరసనగా రాజేశ్ కోర్టుని ఆశ్రయిస్తే, నేడు హైకోర్టు ఇచ్చినతీర్పు నిజంగా ప్రభుత్వానికి చెంపపెట్టేనన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, స్పీకర్ సహా అందరూ ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ టీడీపీపై, ప్రతిపక్షనేత చంద్రబాబుపైచేసిన ఆరోపణలన్నీ నేడుఏమయ్యాయోవారే సమాధానం చెప్పాలని ఆలపాటి డిమాండ్ చేశారు. ప్రతిపక్షంపై, చంద్రబాబుపై చేసిన నిరాధార ఆరోపణలకు ముఖ్యమంత్రే బాధ్యుడని, ప్రభుత్వం చేసిన దుష్ప్రచారానికి ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు స్పష్టంచేసింద న్నారు. భూములక్రయవిక్రయాల్లో తమకు నష్టం జరిగిందని, కొను గోలుదారులు, అమ్మకం దారులు ఎక్కడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలేదన్నారు. పాలకులమోచేతి నీళ్లు తాగే వ్యక్తి ఇచ్చినఫిర్యా దు, ఐపీసీ చట్టాల్లోకి రాదని హైకోర్టుకుండబద్ధలు కొట్టినట్లు చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వంలోని వారు ఏంసమాధానం చెబుతారని మాజీ మంత్రి నిలదీశారు. తూతూమంత్రంగా కేసులుపెట్టి, అరెస్టులు చేసి, వేధింపులు, కక్ష్యసాధింపులే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన డానికి కిలారి రాజేశ్ ఉదంతమే నిదర్శనమన్నారు. తామంటే గిట్టనివారిపై తప్పుడు కేసులుపెట్టి, జైలుకుపంపి, వేధించాలనే క్రిమినల్ ఆలోచనలను నేడుప్రజలు పాలకుల్లో చూస్తున్నారన్నా రు.

పంచాయతీ ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని స్వాగతించిన వైసీపీనేతలు, ప్రభుత్వపెద్దలు, నేడు ఇన్ సైడర్ ట్రేడింగ్ పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు లోబడి, మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు తమపదవులకు రాజీనామా చేస్తారా అని ఆలపాటి నిగ్గదీశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై హైకోర్టు తీర్పు చూశాక, ప్రభుత్వానికి పాలన చేసే హక్కులేదని తమకు అనిపిస్తోందన్నారు. హైకోర్టు తీర్పుకి బాధ్యతవహిస్తూ జగన్మోహన్ రెడ్డి తక్షణమే తనపదవినుంచి వైదొలగాలని ఆలపాటి డిమాండ్ చేశారు. సంబంధంలేని వ్యక్తులతో రాజకీయ క్రీడ ఆడుతున్న ప్రభుత్వం, కడివెడు పాలలో విషపు చుక్కలా, అమరావతిని ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో సర్వనాశనం చేసిందన్నారు. విశాఖలో పాలకులు సాగిస్తున్న భూబాగోతాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అక్కడి భూములను అమ్ముకోవడానికే ప్రభుత్వం అమరావతి లక్ష్యంగా దుష్ప్రచారానికి తెగబడిందన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ నోటికొచ్చినట్లు ఆరోపణలు చేసిన మంత్రులు, వైసీపీఎమ్మె ల్యేలు కిలారి రాజేశ్ ఉదంతంపై, హైకోర్టు తీర్పుపై ఏం సమాధానం చెబుతారో చెప్పాలన్నారు. విజయవాడ- గుంటూరు మధ్యన ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏర్పడుతుందనే ప్రకటనవచ్చాక కొందరు వ్యక్తులు భూములుకొన్నారని, ఆమొత్తం కేవలం 176ఎకరాలు మాత్రమే నని, వైసీపీ ప్రభుత్వం, జగన్ అండ్ కో మాత్రం 4వేల ఎకరాలని నానాయాగీ చేయడం జరిగిందన్నారు. అసత్యంతో, కుయుక్తులతో ప్రజారాజధానిని తరలించాలని చూసేక్రమంలోనే పాలకులు ఈ విధంగా కుట్రపూరిత ప్రచారంచేశారన్నారు. కోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వం తనవైఖరి మార్చుకోకుంటే, ప్రజల పోరాటానికి బలికాక తప్పదని మాజీమంత్రి హెచ్చరించారు. 160 సార్లకు పైగాకోర్టులు ప్రభుత్వ తీరునితప్పుపట్టినా, అర్థరాత్రి పూట ఇచ్చిన జీవోలను కొట్టేసినా, పాలకులవైఖరిలో మార్పురాకపోవడం సిగ్గుచేటన్నారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పుని స్వాగతించిన వైసీపీనేత లు, ప్రభుత్వ పెద్దలు, ఇన్ సైడర్ ట్రేడింగ్ పై న్యాయస్థానమిచ్చిన తీర్పుని కూడా అదేవిధంగా స్వాగతించాలని రాజేంద్రప్రసాద్ డిమాం డ్ చేశారు. కోర్టు తీర్పుపై ముఖ్యమమంత్రికి ఏమాత్రం గౌరవం ఉన్నాకూడా ఆయనతక్షణమే తన పదవికిరాజీనామా చేయాలని టీడీపీనేత డిమాండ్ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read