వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తమ నాయకులకు, అధికార ప్రతినిధులకు, మీడియా ముందుకు తరుచూ వెళ్ళీ నాయకులకు, కీలక ఆదేశాలు పంపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి, ఈ ఆదేశాలు పంపించారు. తమ పార్టీకి చెందిన వాట్స్ ఆప్ గ్రూపుల్లో ఇది పంపించారు. దీనికి సంబంధించిన మెసేజ్ సోషల్ మీడియాలో కూడా తిరుగుతుంది. గత శనివారం రాత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా అజయ్ కల్లం రెడ్డి, మీడియా సమావేశం పెట్టి, కోర్టుల పై, న్యాయమూర్తుల పై ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, తరువాత మీడియాకు కొన్ని లేఖలు విడుదల చేసారు. ఇందులో జగన్ మోహన్ రెడ్డి, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు, కొంత మంది హైకోర్టు జడ్జిల పై, అదే విధంగా ఒక సుప్రీం కోర్టు జడ్జి పై ఫిర్యాదు చేసినట్టు ఆ లేఖలో ఉంది. అయితే ఈ మీడియా సమావేశం గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా, మిగతా వార్తా చానల్స్ ప్రసారం చేయలేదు. కేవలం ఒక టీవీ ఛానల్ మాత్రమే ప్రసారం చేసింది. అయితే గత రెండు మూడు రోజులుగా, కేవలం చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ పై, మిగతా చానల్స్ కూడా ప్రసారం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో, మీడియాలో దీని పై చర్చ మొదలైన నేపధ్యంలో, తమ పార్టీ ముఖ్యులకు, నాయకులకు, అధికార ప్రతినిధులకు, మీడియా ముందు తరుచూ వెళ్ళే వారికి, పార్టీ అధిష్టానం ఒక వాట్స్ అప్ సందేశం పంపించింది.

ఇప్పటికే హైకోర్టు అంశం పై, జగన్ మోహన్ రెడ్డి గారు, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసారని, ఇక పై దీని పై ఏ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టటం కానీ, లేక ప్రెస్ నోట్ విడుదల చేయటం కానీ, చేయవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసారు. ఎవరైనా పదే పదే రెట్టించి ఈ అంశంలో ప్రశ్నలు అడిగితే మాత్రం, ఇప్పటికే ఈ అంశం పై ప్రభుత్వం తరుపున ప్రకటన విడుదల అయ్యింది అని, ఇక దీని పై తాము స్పందించాల్సింది ఏమి లేదు అంటూ, మీడియాకు చెప్పాలి అంటూ సజ్జల ఆదేశాలు జారీ చేసినట్టు, ఆ వాట్స్ అప్ మెసేజ్ సారాంశం. దానికి తగ్గట్టుగానే, వైసీపీ నేతలు ఎవరూ, గత మూడు నాలుగు రోజులుగా ఈ అంశం పై ఎటువంటి వ్యాఖ్యలు మీడియా ముందు చేయలేదు. ఇక అలాగే ఈ అంశం పై, ట్వీట్లు కూడా ఏ నాయకుడు పెట్టలేదు. మరి ఈ ఆదేశాలు ఎందుకు ఇచ్చారు ? కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని, కోర్టుల పై ఏమీ మాట్లాడ వద్దు అని చెప్పరా ? లేక ఈ అంశం పై వైసిపీ వైఖరి ఏమైనా మారిందా అనే అంశం చర్చనీయంసం అయ్యింది. ఇక మరో పక్క, ఈ లేఖ పై వివధ కోర్టు సంఘాలు, సీనియర్ న్యాయవాదులు తీవ్రంగా స్పందిస్తూ, జగన్ వైఖరిని తప్పు బడుతున్న విషయం తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read