ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రతిపక్ష పోరాటానికి తలొగ్గి, నిర్ణయం తీసుకున్న ఘటన, బహుసా ఈ 18 నెలల్లో ఇది ఒక్కటేనేమో. 151 సీట్లతో గెలిచిన జగన్ మోహన్ రెడ్డి, ఏ నాడు తెలుగుదేశం పార్టీ లేవనెత్తిన అంశాలు పట్టించుకోలేదు. ప్రభుత్వం వచ్చిన కొత్తలో, తెలంగాణాతో కలిసి చట్టాపట్టాల్ వేసుకుని తిరిగుతున్న సందర్భంలో కూడా చంద్రబాబు, జగన్ కు వార్నింగ్ ఇచ్చారు. ఇది మీ ఇద్దరి మైత్రి విషయం కాదు, రెండు రాష్ట్రాల భవిష్యత్తు, మీ ఇష్టం కాదు అంటూ, వార్నింగ్ ఇచ్చారు. అప్పట్లో చెవికి ఎక్కించుకోని జగన్, కేసిఆర్ ఎంతో గొప్పవారు అని అసెంబ్లీలో చెప్పారు. అయితే తరువాత తత్వం బోధ పడిందో ఏమో కానీ, అప్పటి నుంచి కేసీఆర్ జోలికి అయితే వెళ్ళటం లేదు. అయితే తాజాగా ఇప్పుడు మరో అంశంలో, ఇలాగే దూకుడుగా వెళ్ళినా, చివరకు తెలుగుదేశం పార్టీ చెప్పిన విషయం పై, గంటలు గడవక ముందే రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు రోజుల క్రిందట అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన సంగాతి తెలిసిందే. మొదటి రోజున, నీరవ్ తుఫాన్ వల్ల రైతులు ఎదురుకున్న ఇబ్బందులు, పంట నష్టం గురించి చర్చ జరిగింది. ఈ సందర్బంగా మంత్రి కన్నబాబు ఎప్పటిలాగానే జగన్ మోహన్ రెడ్డి భజన అందుకున్నారు. అయితే ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ లేవనెత్తిన అంశంతో ఒక్కసారిగా ప్రభుత్వం షేక్ అయ్యింది. కన్నబాబు మాట్లాడుతూ, తాము రైతుల తరుపున మొత్తం పంట భీమా ఇన్సురన్సు ప్రీమియం కడుతున్నాం అంటూ, చెప్పారు.

jagan 02122020 2

సరిగ్గా ఈ అవకాసం కోసమే ఎదురు చూస్తున్న తెలుగుదేశం పార్టీ, మీరు ఇన్సురన్సు కట్టలేదు, అబద్ధం చెప్తున్నారు అంటూ నినాదాలు చేసారు. లేదు మేము కట్టేసాం అని కన్నబాబు ఎదురు చెప్పారు. అయితే తమ దగ్గర ఆర్టీఐ రిపోర్ట్ ఉందని, మీరు కట్టలేదు ని తెలుగుదేశం చెప్పటంతో, డిసెంబర్ 15 న కడతాం అంటూ మాట మార్చారు. దీంతో అందరూ అవాక్కయారు. వెంటనే చంద్రబాబు దీని పై తాను మాట్లాడాలని, రైతులకు ఇంత అన్యాయం చేస్తారా, ఇన్సురన్సు కట్టకుండా, ఇప్పుడు తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ఇంత నష్టం చేస్తారా అంటూ అసెంబ్లీలో నేల పై కూర్చుని ధర్నా చేసారు. అయితే అప్పుడు ప్రభుత్వం చంద్రబాబుని కామెడీ చేసింది, ఏముంది, ఎందుకు హడావిడి, రేపు పేపర్ లో రావటానికి అంటూ దెప్పి పొడిచింది. అయితే ఇవి ప్రజల్లోకి వెళ్ళటంతో, చేసిన తప్పు తెలుసుకున్న ప్రభుత్వం రాత్రికి రాత్రి 590 కోట్లు రిలీజ్ చేస్తూ, జీవో విడుదల చేసింది. తాము చేసిన తప్పు, ప్రతిపక్షం చెప్పే దాకా, అధికార పక్షానికి తెలియలేదు. ఏది అయితేనేం రైతులకు ఇలా అయినా న్యాయం జరిగితే చాలు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read