గత 20 రోజులుగా రాష్ట్రంలో కరోనా భయం కంటే ఎక్కువగా, పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణ పై, టెన్షన్ నెలకొంది. ఈ సమయంలో పరీక్షలు పెడితే, ఏమి అవుతుందో అని అందరూ కంగారు పడుతున్నారు. మరో పక్క లోకేష్ ఈ విషయం పై పోరాడుతున్నారు. పిల్లలతో, తల్లిదండ్రులతో సెషన్స్ పెట్టి, ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు. చివరకు న్యాయ పోరాటం కూడా చేసారు. హైకోర్టులో మొన్న గట్టి వాదనలు వినిపించారు. దీంతో హైకోర్టు ప్రభుత్వాని, మరోసారి తమ నిర్ణయం సరి చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే కోర్టు ఒక అంచనాకు వచ్చింది, మనకు ఇబ్బందులు వస్తాయని అనుకున్నారో ఏమో కానీ, ఈ రోజు ప్రభుత్వం ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్ధులు ఊపిరి పీల్చుకున్నారు. నారా లోకేష్ గట్టిగా పోరాటం చేయకపోతే, కోర్టులో కేసు వేయకపోతే, ప్రభుత్వం దిగి వచ్చేది కాదని, లోకేష్ కు ధన్యవాదాలు చెప్తున్నారు. అలాగే ఈ పోరాటంలో సహకారం అందించిన రఘురామకృష్ణం రాజు గారికి, కేఏ పాల్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పారు. మొత్తంగా ఏది అయితే ఏమి, ప్రజల పోరాటానికి, ప్రభుత్వం దిగి వచ్చింది. ఇంకా పట్టుదలకు పోకుండా, కనీసం ఒక రోజు ముందు అయినా వాయిదా వేయటం శుభ పరిణామం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read