ఐపీఎల్-12 సీజన్ కోసం ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్ వేదికగా ఈరోజు ప్రారంభమైన ఈ వేలం పాట ప్రక్రియ కొనసాగుతోంది. 2019 సీజన్ కు అవసరమైన ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు తుది వడపోత అనంతరం మిగిలిన 351 మంది నుంచి 70 మందిని లీగ్ లోని 8 జట్లు ఎంపిక చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన వేలంలో పేసర్ ఉనాద్కట్ ను రూ.8.4 కోట్లతో రాజస్థాన్ జట్టు కొనుగోలు చేసింది. టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు. యువీ కనీస ధర రూ. 1 కోటి ఉండగా అతనిపై ఎవరూ ఆసక్తి చూపలేదు.

ipl 18122018 2

ఇక ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారి కనీస ధర రూ.50 లక్షలు ఉండగా రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని కొనుగోలు చేయడంతో జాక్ పాట్ కొట్టాడు. హనుమ విహారి స్వస్థలం. .ఏపీలోని కాకినాడ. దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్ జట్టు నుంచి కెరీర్ ప్రారంభించిన విహారి..ప్రస్తుతం ఆంధ్రా జట్టుకు ఆడుతున్నాడు. 2010 నుంచి 2016 వరకు హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2016-17 సీజన్‌లో ఆంధ్రా జట్టుకు మారిన తర్వాత విహారి కెరీర్‌ ఊపందుకుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బ్యాట్‌తో సత్తాచాటిన విహారి 5142 పరుగులు చేశాడు. 15 సెంచరీలతో పాటు 22 అర్ధ సెంచరీలు సాధించాడు. 302 అత్యధిక స్కోరు. 2017-18 సీజన్‌లో మెరుగైన ప్రదర్శనతో టాప్‌-5లో నిలిచాడు.

ipl 18122018 3

ఆంధ్ర క్రికెట్‌ నుంచి భారత టెస్టు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వారిలో ప్రస్తుత జాతీయ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ చివరి ఆటగాడు. 1999లో న్యూజిలాండ్‌పై వికెట్‌ కీపర్‌గా అతడు అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతం నుంచి ఆ స్థాయిలో అంచనాలు పెంచిన ఆటగాడు ఇప్పటిదాకా లేడు. కానీ 19 ఏళ్ల ఎదురుచూపుల అనంతరం 24 ఏళ్ల హనుమ విహారి ఇప్పుడు భారత టెస్టు జట్టులోకి రావటం, ఇప్పుడు ఏకంగా ఎక్కువ పోటీ ఉండే, ఐపీఎల్ లాంటి చోట, హాట్ ఫేవరేట్ గా ఉన్నాడు. భారత క్రికెట్ జట్టులో రానిస్తున్నట్టే, ఐపీఎల్ లో కూడా, మంచి పేరు తెచ్చి, మన రాష్ట్రం పేరు నిలబెట్టాలని కోరుకుందాం..

Advertisements

Advertisements

Latest Articles

Most Read