జగన్ మోహన్ రెడ్డి, మొదటి సారి సచివాలయానికి వెళ్ళినప్పుడు, అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు, జై జగన్, జై జగన్ అని నినాదాలు చేసినంత సేపు పట్టలేదు, వీళ్ళకు జరిగిన నష్టం తెలుసుకుని, బాధ పడటానికి. కొత్తగా వచ్చిన జగన్, 27 శాతం ఐఆర్ పెంచారు అని అనుకుకునే లోపే, తరువాత వచ్చిన వివరణ చూసి షాక్ అయ్యారు. అసలు విషయానికి వస్తే, చంద్రబాబు ప్రభుత్వం ఫిబ్రవరి 18 , 2019 న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల 01.04.2019 నుంచి 20 శాతం జీతాలు పెంచుతూ జీవో నెంబర్ 21 విడుదల చేసింది. దీని ప్రకారం ప్రతి ఉద్యోగికి ఎప్రిల్, మే, జూన్, నెలలో పెరిగిన జీతం 20 శాతం జులై 2019 లో తీసుకోవాలి. మూడు నెలలు పెరిగిన జీతం ఒకేసారి వస్తుందని ఉద్యోగులు అనుకున్నారు. కాని వీరిలో చాలా మంది జగన కు ఓటు వేసి గెలిపించుకున్నారు. ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చారు. వచ్చీ రాగానే ఉద్యోగుల కి 27 శాతం పెంచారు. ఉద్యోగుల అందరూ సంబర పడ్డారు. కొంత మంది అయితే సచివాలయంలో జై జగన్ అనే నినాదాలు చేశారు.

ir 17062019 2

జగన్ పెంచిన 27 శాతం జీతం జులై నుంచి అంటే ఆగస్ట్ లో తీసుకోవచ్చు అని, జూన్ జీతం జులై లో తీసుకునేటప్పుడు చంద్రబాబు మూడు నెలలు పెంచిన 20 , 20, 20 మొత్తం 60 శాతం తీసుకోవచ్చని, జులై జీతం ఆగస్ట్ లో తీసుకునెట్టాప్పుడు 27 శాతం తీసుకోవచ్చు అని ఆనంద పడ్డారు. ఆ ప్రకారం ఎప్రిల్ , మే, జూన్ జీతాలు 60 శాతం పెంచుకుని ఇప్పుడు బిల్లులు తయారు చేసి CFMS లో ఎంట్రీలు వేసుకున్నారు. అయితే CFMS లో వీటిని రిజెక్ట్ చేస్తున్నారు. చంద్రబాబు పెంచిన, ఏప్రిల్ , మే జూన్ 20 శాతం పెంపు లేదు అని, జులై నుంచి 27 శాతం పెంపు మాత్రమే ఉంది అని ప్రభత్వ ఉద్యోగులకు ఒక నోట్ వచ్చింది. ఇది సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతుంది. అయితే ఈ నిర్ణయం పై, ఉద్యోగులు అవాక్కయ్యారు. చంద్రబాబు పెంచిన మూడు నెలలు 20 శాతం ఇవ్వకండ మిగిలిన తొమ్మిది నెలల 27 శాతం చొప్పున ఇస్తే, ఈ సంవత్సరానికి, సగటున నెలకి పెరుగుదల 20 శాతం మాత్రమే ఉంటుందని, ఇంకా జగన్ పెంచిన 27 శాతం ఈ ఏడాదికి లేనట్టే కదా అని లెక్కలు వేసుకుంటున్నారు.

ఏప్రిల్ మూడు నెలల IR నష్టపోయినట్లు అంటే 60% నష్టపోయాం, ఈ సిక్స్టీ పెర్సెంట్ మనకు కవర్ అవ్వాలంటే, తొమ్మిది నెలలు, అంటే మార్చి 2020 వరకు మనం 20 .% IR తీసుకున్నట్లే. అంటే గవర్నమెంట్ మనకు ఏడు శాతం పెంచి, 27 శాతం అని లెక్కల్లో చూపించిన మనం మాత్రం 2020 మార్చి వరకు పాత గవర్నమెంట్ ఇచ్చిన 20 శాతం ఐఆర్ తీసుకున్నట్లే అని లెక్కలు వేసుకుంటున్నారు. చంద్రబాబు పెంచిన మూడు నెలల జీతం ఇవ్వకుండా, ఇదేమి ఫిట్టింగ్ అంటూ గోల చేస్తున్నారు. దీని పై ఎదో ఒక నిర్ణయం తీసుకోవాలని, చంద్రబాబు హాయంలో పెంచిన మూడు నెలలకు, 20 శాతం ఐఆర్ ఇవ్వాలని, దీనికి అనుగుణంగా, జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు. మరి ప్రభుత్వం, ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇది చంద్రబాబు ఇచ్చిన జీఓ... G.O.Ms.No.21 Dated: 18-02-2019 Interim Relief will be paid at the rate of 20% of the basic pay. It is sanctioned notionally w.e.f 01.07.2018. Monetary benefit will be w.e.f. 01.04.2019 and payable in the month of June 2019.

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read