ఒక విజన్ తో రాజకీయ నాయకులు పని చేస్తే, తరతరాలు ఆ ఫలాలు ఎలా పని చేస్తాయి అని చెప్పటానికి ఉదాహరణ, నారా చంద్రబాబు నాయుడు. కాకపొతే మన తెలుగు రాష్ట్రాల్లో, ఆయన్ను ఒక ప్రాంతం వాడిగా, ఒక కులం వాడిగా ముద్ర వేయటంలో, ప్రత్యర్ధులు విజయం సాధించటం, ఆ విష ప్రచారం చంద్రబాబు సమర్ధవంతంగా తిప్పి కొట్టక పోవటంతో, ఆయన ఎన్నికల సంగ్రామంలో పలు మార్లు ఓడిపోయారు. అయినా ఒక దార్శనికుడుగా ఆయన చేసిన పనులు తరతరాలు అనుభవిస్తూనే ఉన్నాయి. "What Chandrababu Naidu thinks today, India Thinks Tomorrow" అంటూ గతంలో ఇండియా టుడే, టైం నౌ లాంటి జాతీయ చానల్స్ లో చంద్రబాబు గురించి చెప్తూ ఉండేవారు. అది ప్రత్యర్ధులకు అతి అనిపించినా, అదే నిజం. దానికి వంద ఉదాహరణలు చెప్పవచ్చు. తాజాగా 20 ఏళ్ళ నాడు చంద్రబాబు విజన్ తో మొదలు పెట్టిన ఇంటర్నేషన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్‌బీ), నేడు 20 వసంతాలు పూర్తి చేసుకోవటంతో, చంద్రబాబు ఉన్న ఫోటోని గుర్తు చేస్తూ, ఒక ట్వీట్ వేసారు. అందులో వాళ్ళు రాసింది, "Business visionaries who thought ahead of their time and piloted the ISB project.". ఆ ఫోటోలో హేమాహేమీలు ఉన్నారు. చంద్రబాబు, అప్పటి ప్రధాని వాజ్‌పేయి, అప్పటి రాష్ట్ర గవర్నర్ సీ రంగరాజన్ ఉన్నారు.

isb 22012021 2

వీరితో పాటు, ఆనంద్ మహీంద్రా, అనిల్ అంబానీ లాంటి పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. 20 ఏళ్ళ నాడు తాము ఎలా మొదలైంది, ఇంటర్నేషన్ బిజినెస్ స్కూల్ ట్వీట్ చేసింది. ఐఎస్‌బీ లాంటి అత్యున్నతమైన సంస్థ హైదరాబాద్ లో రావటానికి, నాడు చంద్రబాబు చేసిన కృషి అందరికీ తెలిసిందే. ఇండియాలోని దిగ్గజ బిజినెస్ సంస్థలు అంతా కలిసి ఒక సంస్థ ఏర్పాటు చేయాలని, ఆనాడు ఢిల్లీ, ముంబై, బెంగళూర్ లాంటి మెట్రో నగరాలను పరిగణనలోకి తీసుకుంటున్న పారిశ్రామిక కోర్ కమిటీ వారిని, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అప్రోచ్ అయ్యి, వారిని కాఫీకి పిలిచి మెప్పించి, ఇలాంటి దిగ్గజ సంస్థను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేలా చేయగలిగినారు. ఈ ఫోటో ఐఎస్‌బీ ట్వీట్ చేయగానే, చంద్రబాబు దాన్ని రీట్వీట్ చేస్తూ, గతాన్ని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ లో అత్యున్నత సంస్థ ఏర్పాటు చేయాలని అనుకున్న ఫలితమే ఐఎస్‌బీ అని గుర్తు చేసారు. అయితే ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చంద్రబాబు ఏమి చేసారో తెలియని బొడ్డూడని పిల్లకాయలు కూడా ఆయన్ను కుల ద్వేషంతో విమర్శిస్తారు కానీ, అయన చేసిన పనులు మాత్రం, వీళ్ళను వెక్కిరిస్తూనే ఉంటాయి. ఎందుకంటే అవి చరిత్రపుటల్లో శాస్వతంగా చెరిపేయలేని గుర్తులుగా నిలిచేవుంటాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read