రాష్ట్రంలో సంచలనం రేపిన ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రా కంపెనీ యాజమాన్యం ఆస్తుల పై ఆరు రోజులుగా ఐటీ అధికారుల సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఆరు రోజుల పాటు, ఐటి దాడులు చెయ్యటం అంటే, ఇది ఒక సంచలనంగానే చెప్పచ్చారు. మేఘా కంపెనీ యాజమాన్యం మాత్రం ఇది ఐటీ అధికారులు ప్రతి ఏటా జరిపే ఖాతాల పరిశీలనలో భాగమేనని చెబుతున్నప్పటికీ, ఐటీ అధికారులు మాత్రం అందుకు భిన్నంగా ఆరు రోజులుగా మేఘా సంస్థ ప్రతినిధుల నివాసాలు, కార్యాలయాలు, బ్యాంకు ఖాతాలు, లాకర్‌లలో సోదాలు జరిపారు. ఎక్కడా స్టేట్ టీమ్స్ కి సమాచారం ఇవ్వకుండా, డైరెక్ట్ గా ఢిల్లీ నుంచి వచ్చిన టీమ్స్ ఈ సోదాలు జరిపాయి. సీఆర్పీఎఫ్ బలగాలు కూడా రంగంలోకి దిగి, బద్రత కల్పించాయి. అయితే మేఘా కృష్ణా రెడ్డి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు దగ్గర ఆయన కావటంతో, అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

megha 19102019 2

సోదాల్లో భాగంగా, బాలానగర్‌, ఐడీఏ బొల్లారం, మాదాపూర్‌ కావేరి హిల్స్‌లో మేఘా కంపెనీ ఛైర్మన్‌ పిచ్చిరెడ్డి, ఎండీ కృష్ణారెడ్డి, మరో డైరెక్టర్‌కు చెందిన ఖాతాలు, లాకర్‌లను ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలిసింది. ఈ సమయంలో సంబంధితులనూ వెంట తీసుకుని వెళ్లి మరీ సోదాలు జరిపినట్లు సమాచారం. అన్ని ఖాతాలలో ఎంత మేరకు నగదు ఉంది ? లాకర్‌లలో ఎంత మొత్తంలో బంగారు నగలు, వజ్రాలు ఉన్నాయనే దానిపై వివరాలు సేకరించినట్లు సమాచారం. బాలానగర్‌ ఆంధ్రా బ్యాంకులోని లాకర్‌లో ఉంచిన నగలను ఐటీ అధికారులు స్వాధీనపరుచుకున్నట్లు తెలిసింది. వాటి విలువ దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఐటీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఐటీ అధికారులు ఇప్పటి వరకు బయటకు చెప్పలేదు.

megha 19102019 3

ఈ రోజు, ఐటి అధికారులు అఫిషియల్ ప్రెస్ నోట్ విడుదల చేసారు. ప్రెస్ నోట్ లో సంచలన విషయాలు ఉన్నాయి. 30 చోట్ల ఏక కాలంలో, హైదరబాద్, ఢిల్లీ , ముంబై లో దాడులు చేసామని, పెద్ద ఎత్తున నకిలీ బిల్లులు, సబ్ కాంట్రాక్టు లావాదేవీలు కనుక్కున్నామని చెప్పారు. లెక్కల్లో చాలా తేడాలు గమనించామని చెప్పారు. అంతే కాదు, హవాలా మార్గం ద్వారా, వందల కోట్లు గుర్తించి, వాటిని సీజ్ చేసామని చెప్పారు. ఇక 17.4 కోట్ల క్యాష్ కు సంబంధించి లెక్కలు లేకపోవటంతో, వాటిని కూడా సీజ్ చేసామని చెప్పారు. వీటి అన్నిటి పై, విచారణ జరుపుతున్నామని అన్నారు. అయితే, ఐటి ప్రెస్ నోట్ చూస్తే, వందల వేల కోట్లు హవాలా మార్గం ద్వారా వచ్చినట్టు అర్ధమవుతుంది. వీటి అన్నిటి పై విచారణ జరిపితే, పెద్ద తలకాయలు బయట పడటం ఖాయం..

Advertisements

Advertisements

Latest Articles

Most Read