కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై పరోక్షంగా దెబ్బతీసే కార్యక్రమాన్ని చేపట్టిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ముఖ్యంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నుండి తెలుగుదేశం పార్టీ వైదొలగిన అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో టీడీపీ-బీజేపీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న విషయం విదితమే. అయితే ఏపిలోని రాష్ట్ర ప్రభుత్వం పై వివిధ రకాలైన ఒత్తిడిని తీసుకురావడంతో పాటు వేధింపులు కూడా జోడించాలన్నదే బీజేపీ లక్ష్యంగా పనిచేస్తోందని రాష్ట్ర టిడిపి వర్గాలు చెబుతున్నాయి.

polavaram 11082018 2

దీనికి ప్రధానకారణం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో భారీ సాగునీటి ప్రాజెక్టు పనులు చేపట్టిన పలు కాంట్రాక్టు సంస్థలపై గత వారం రోజులుగా 'రహస్య ఐటీ దాడులు నిర్వహించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ విషయం బయటకు పొక్కడానికి వీలు లేదని ఐటీ శాఖ అధికారులు ఆయా కాంట్రాక్టర్లకు “హుకుం' కూడా జారీ చేసినట్లు తెలిసింది. ఉభయ తెలుగు రాష్ట్రాలల్లో సాగునీటి ప్రాజెక్టుల పనులు నిర్వహిస్తున్న బడా కాంట్రాక్టర్ల పైనే ఐటి శాఖ దృష్టిసారించిందని, దీని వెనుక కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కొందరు సిఎం చంద్రబాబును వేధింపులకు గురి చేయాలన్న ఉద్దేశంతోనే ఇటువంటి తనిఖీలు చేయిస్తున్నారని తెలిసింది.

polavaram 11082018 3

దీంతో ఐటి అధికారుల దాడులతో ఆయా కాంట్రాక్టర్లు ప్రాజెక్టుల పనులు చేపట్టేందుకు వీలు లేకుండా చేస్తున్నారని టిడిపి సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా ఎపిలోని రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఈ రకమైన దాడులు చేయిస్తున్నారని పార్టీ వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుండి టిడిపి వైదొలిగిన తరువాతనే ఇటువంటి సరికొత్త దాడులకు పాల్పడుతున్నారని నిర్ధారిస్తున్నారు. మరోపక్క కేంద్రంలో బీజేపీని ఇరకాటంలో పెట్టేలా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు మూకుమ్మడిగా పార్లమెంట్ ఉభయసభల్లో చేస్తున్న ఆందోళనలను తిప్పికొట్టేందుక ఇటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.

polavaram 11082018 4

ప్రధాన మంత్రి మోడీకి వ్యతిరేకంగా గళమెత్తిన టిడిపి ఎంపిలను కట్టడి చేయడానికే రాష్ట్రంలో ఐటీశాఖ భారీ సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన కాంట్రాక్టర్ల సంస్థలపై దాడులు నిర్వహిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఎపి సిఎం చంద్రబాబును నేరుగా ఢీకొనే సత్తా బీజేపీకి లేకనే ఇటువంటి దొంగచాటు వ్యవహారాలకు పాల్పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. ఎపి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'పోలవరం' ప్రాజెక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల పై బీజేపీ పెద్దలు నేరుగా గురిపెట్టారని, దీనిలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు మొదలుకొని జాతీయస్థాయి నేతల వరకూ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో తాజాగా ఆయా కాంట్రాక్టు పై జరుగుతున్న రహస్య దాడులపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

polavaram 11082018 5

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని భావిస్తున్న బీజేపీ పెద్దలు ఆయా కాంట్రాక్టర్లను ఢిల్లీకి పిలిపించుకొని, సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలు, అవినీతి గురించి జాతీయ మీడియా ద్వారా బహిర్గతం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ప్రస్తుతం ఐటి దాడులు ఎదుర్కొన్న కొంతమంది కాంట్రాక్టర్లు ఐటి శాఖ ఉన్నతాధికారులకు లెక్కలతో సహా పూర్తి సమాచారాన్ని అందించారని అమరావతీ సచివాలయంలోని ఆర్థికశాఖలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే వీరిలో కొంతమంది కాంట్రాక్టర్లు మాత్రం తాము చట్టబద్ధంగానే పనులు నిర్వహిస్తున్నామని, అందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టబద్ధంగానే వ్యవహరిస్తోందని, దీనిలో ఎలాంటి అక్రమాలు, అవినీతి జరగలేదని తేల్చిచెప్పినట్లు సమాచారం.

polavaram 11082018 6

తమకు ఇచ్చిన సాగునీటి కాంట్రాక్టుల వల్ల తమకు నష్టం వచ్చిందని, అయినా రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పనులు కొనసాగిస్తున్నామని, సాగునీటి కార్యాలయాలన్నీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉండటం వల్ల అక్కడే 'ఈ ఐటి శాఖ రహస్య దాడులు" జరిగాయని తెలిసింది. దీనికి తోడుగా తెలంగాణ కీలకమైన ప్రాజెక్టులన చేస్తున్నప్పటికీ ఆయా సంస్థల పై ఐటీశాఖ అధికారులు ఇప్పటి వరకూ ఎలాంటి దాడులు నిర్వహించలేదని, కేవలం ఆంధ్రప్రదేశ్ లో పనలు నిర్వహిస్తున్న సాగునీటి కాంట్రాక్టర్ల నే ఐటి శాఖ దాడులు చేపట్టిందని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే రాష్ట్రంలో ఐటిశాఖ దాడులు నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్ర ఐటీశాఖ అధికారులకు కనీస సమాచారం అదించడం ఆనవాయితీ. అయితే అందుకు భిన్నంగా జరిగిన ఈ వ్యవహారంతో రాష్ట్ర ఐటీశాఖ అధికారులు కూడా అవాక్కయినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోనుందో వేచి చూడాల్సిందే. న్యూస్ సోర్స్ : ఆంధ్రప్రభ

Advertisements

Advertisements

Latest Articles

Most Read