ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆర్ధిక పరిస్థితి ఆందోళన కలిగిస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పని చేసిన ఐవైఆర్ కృష్ణా రావు అభిప్రాయ పడ్డారు. ఆయన రెండు రోజుల క్రితం ట్వీట్ చేస్తూ, తనకు జరిగిన స్వీయ అనుభవం వివరించారు. తనకు ఈ నల పెన్షన్ వారం తరువాత వచ్చినందని, నెల ప్రారంభమైన ఏడు రోజుల తరువాత తనకు పెన్షన్ డబ్బులు పడ్డాయని అన్నారు. సహజంగా ఏ ప్రభుత్వానికి అయినా, ముందు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ఇవ్వాల్సిన పెన్షన్లు, వడ్డీల చెల్లింపులు మొదటి వరసులో ఉంటాయని అన్నారు. సహజంగా ఇలాంటి చెల్లింపులు, ఒకటి రెండు రోజులు అటు ఇటూగా పడుతూ ఉంటాయని, కనీ ఇలా ఎప్పుడూ జరగలేదని అన్నారు. వారం పాటు పెన్షన్లు వెయ్యలేదు అంటూ, రాష్ట్రంలో ఉన్న ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, అర్ధం అవుతుంది అంటూ, తన ట్వీట్ లో తెలిపారు, ఐవైఆర్ కృష్ణా రావు. అంతే కాకుండా, రాష్ట్రం గురించి మరో సంచలన వ్యాఖ్య చేసారు.

వస్తున్న ఆదాయం గురించి ఆలోచించ కుండా, పెద్ద ఎత్తున వ్యయం చేస్తూ ఉంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా భంగపాటు తప్పదని, ఒక నాలుగు రోజులు వెనకా ముందు అంతే, అంటూ, రాష్ట్ర పరిస్థితి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. అలాగే మరో ట్వీట్ చేస్తూ, ఆర్ధిక పరిస్థితి బాగుండాలి అంటే, వచ్చిన ఆదాయం సంక్షేమ పధకాలకు ఇచ్చి, తెచ్చిన అప్పులతో పెట్టుబడిగా పెట్టి, ఆదాయం వచ్చేలా చూడాలని, అంతే కానీ అప్పు తెచ్చి, పంచి పెడితే దివాళా తీస్తారు అంటూ, ఐవైఆర్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి పై పలువురు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు తెస్తూ, వాటిని ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగం చెయ్యకుండా, పంచిపెడుతూ ఓటు బ్యాంకు కోసం చూస్తూ, ఆర్ధిక పరిస్థితిని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు అంటూ, పలువురు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read