గుండెపోటుతో మృతిచెందిన భూమా నాగిరెడ్డికి నిన్నశాసనసభ సంతాపం ప్రకటించింది. భూమాతో తమకున్న అనుబంధం, ప్రజలకు ఆయన చేసిన సేవలను సభ్యులు గుర్తుచేసుకున్నారు.తన తండ్రికి సంతాపం ప్రకటిస్తున్న నేపథ్యంలో ఆవేదనను దిగమింగి ప్రజాస్వామ్యంపై గౌరవం, ప్రజల పక్షాన నిలిచేందుకు సభా సంప్రదాయాలను పాటిస్తూ అఖిలప్రియ సభకు హాజరవడం విశేషం.

ఇదే సందర్భంలో ప్రతిపక్షం వైకాపా భూమా సంతాప సభకు గైరుహాజరు కావడం దురదృష్టకరం. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్సిన వైకాపా ఇప్పుడు నైతిక, మానవ విలువలను తుంగలో తొక్కింది. ఈ సందర్భంలో, జగన్ గారు మాట్లాడుతూ, నాకు చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. చంద్రబాబు విలన్, నేను హీరో అన్నారు.. అయితే, ఆయన ఎలా పోల్చుకున్నారో కాని, చరిత్ర చుస్తే, నిజంగానే ఈ సామేత, జగన్ గారికే సరిపడేలా ఉంది.

జగన్ గారు నిన్న అన్నారు, భుమా ఒక చెడ్డ పని చేశాడు, అది చెప్పటం ఇష్టం లేకే, రాలేదు అని. జగన్ గారి సాక్షి, జగన్ గారి మనుషులు, భుమాని టార్చర్ పెట్టి చంపారు అని రాసారు. సరే, ఇవన్నీ రాజకీయ ఆరోపణలు, నిజమే అని కాసేపు అనుకుందాం. రాజకీయాలు ఉండవచ్చుకానీ ఒక శాసనసభ్యుడు మృతి చెందితే కనీసం నివాళులు అర్పించకపోవటం కర్రెక్టా ?

ఇంకో విషయం జగన్ గారు మర్చిపోయారు ఏమో.. పరిటాల రవి చనిపోయినప్పుడు, రాజశేఖర్ రెడ్డి చంపించాడు అని తెలుగుదేశం ఆరోపిస్తున్నా, రాజశేఖర్ రెడ్డి మానవతా కోణం మర్చిపోలేదు. శాసనసభలో పరిటాల రవి చనిపోయిన తర్వాత, సంతాప తీర్మానం పెట్టి, రవి చేసిన మంచి పనులు గుర్తు చేసారు రాజశేఖర్ రెడ్డి.. అది హుందాతనం... అది ఒక పరిపక్తత కలిగిన నాయకుడు చేసే రాజకీయం...

ఇన్ని నీతులు చెప్పే మీరు, ఇంకో విషయం మర్చిపోయారు జగన్ గారు.. శోభా నాగిరెడ్డి గారు చనిపోయినాక, బై-ఎలక్షన్ అప్పుడు, మీరు అఖిల ప్రియ గారిని నిలబెడతాను అనాలా, మీ అమ్మ విజయమ్మ గారిని నిలబెడతాను అన్నారు... అప్పుడు భూమా నాగిరెడ్డి కుదరదు అంటే, అప్పుడు అఖిల ప్రియకి సీట్ ఇచ్చారు... మర్చిపోయారు అనుకుంటా.. కావాలంటే చూడండి...
http://www.business-standard.com/article/news-ians/andhra-s-allagadda-seat-not-in-assembly-by-poll-list-114081600470_1.html

cbn jagan 15032017 2


ఈ క్రింద వీడియోలు చూడండి...
శాసనసభలో తనపై వైఎస్‌ వ్యక్తిగత దూషణలు కూడా చేసినా, ఎంత అవమానించినా వైఎస్‌ చనిపోయినప్పుడు ఇంటికి వెళ్లి జగన్‌ను పరామర్సించారు చంద్రబాబు. పులివెందులలో విజయమ్మ పోటీ చేస్తే అభ్యర్థిని కూడా నిలబెట్టలేదని చంద్రబాబు చెప్పారు. 274 మంది కార్యకర్తలను హత్య చేసినా, చంద్రబాబు పై ఎన్నో కేసులు పెట్టించినా, తెలుగుదేశం నాయకులని ఎంతో మానసికంగా వేదించినా, అవన్నీ రాజకీయాల వరకే. రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు, శాసనసభ హుందాతనాన్ని నిలబెట్టారు చంద్రబాబు. రాజశేఖర్ రెడ్డి తో ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు.. ఈ క్రింది వీడియో చూడండి, రాజశేఖర్ రెడ్డి చనిపోయారు అని తెలుసుకుని, అప్పటికప్పుడు, ప్రెస్ మీట్ పెట్టి రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు చంద్రబాబు.

ఈ వీడియో చూడండి... సాక్షి పత్రిక, జగన్మోహన్ రెడ్డి నాయకులు చేస్తున్న విష ప్రచారానికి పరాకాష్ట.... శోభా నాగిరెడ్డి చనిపోయినప్పుడు, చంద్రబాబు ప్రభుత్వం అస్సలు శాసనసభలో సంతాప తీర్మానం పెట్టలేదు అని పచ్చిగా అబద్ధాలు ఆడుతున్నారు. శోభా నాగిరెడ్డి చనిపోయే నాటికి జగన్ పార్టీలో ఉన్నారు. చంద్రబాబు మీద వ్యతిరేకంగా ప్రచారం చేసి ఎలక్షన్ లో గెలిచారు (అప్పటికే చనిపోయారు)... అయినా చంద్రబాబు మా పార్టీ కాదు, వాళ్ళు చెడ్డ పనులు చేసారు అని అలిగి మూల కూర్చోలా... సంప్రదాయాలని కొనసాగించారు... మానవతా కోణం చూపారు..

ఇప్పుడు చెప్పండి, జగన్ గారు అన్నది నిజమే కాదా, జగన్ కు.. చంద్రబాబు కి.. నక్కకు...నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read