ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటేనే అది ఒక అత్యున్నత పదవి. ఒక వ్యక్తిని ప్రజలు నమ్మి రాష్ట్ర బాధ్యతను తన చేతుల్లో పెట్టినప్పుడు ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సి వస్తుంది . ఒక నాయకుడిగా సీఎం స్థాయిలో ముందుండి రాష్ట్రాన్ని నడిపించాల్సిన వ్యక్తి అయిన జగన్ ఏ ఒక్క విషయంలోనూ బాధ్యతగా ప్రవర్తించటం లేదు . చిన్న పిల్లలు కూడా కనీసం సి.ఎం సీటు కి గౌరవం ఇవ్వటం లేదంటే దానికి కారణం మన సీఎం గారి భాష . ఒక నాయకుడిగా ముందుండి రాష్ట్రాన్ని నడిపించాల్సిన వ్యక్తి ఇలాప్రజా సభల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వలన ఆయనకు ఉన్న కొద్ది గౌరవాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి సభలో స్పీచ్ చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తోంది . ఆ స్పీచ్ లో విపక్షాల గురించి తన నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తన వెంట్రుక కూడా పీకలేరు అనడం ఇలాంటి రకమైన మాటలు చూస్తుంటే , ఒక ముఖ్యమంత్రి ఇలాగేనా మాట్లాడేది అని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు . పెద్దలే కాకుండా పిల్లలు కూడా విమర్శించే పరిస్థితి మన రాష్ట్రంలో ఏర్పడింది. ఎందుకంటే ఈయన ఇలాంటి బూతు బాష మాట్లాడేది అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన లాంటి సభల్లోనే. ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల ,అది పిల్లల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది . మనం ఏదైనా మాట్లాడచ్చు లే అనే భావం పిల్లల్లో కలగటం ఖాయం . అంతే కాకుండా ముఖ్య మంత్రి గా ఆయన స్థాయి మరింత దిగజారి పోతోంది. ఇక జగన్ బాటలోనే వైసీపీ నేతలు కూడా నడుస్తున్నారు. మహిళా వైసీపీ నేతలు కూడా ఈ బూతు భాషకు ఏమాత్రం తీసిపోరు. వీళ్ళు ఇలా బహిరంగసభలో ప్రతిపక్షాలను విమర్సించడం వల్ల వాళ్ళు ఆనందం పొందుతారు కాని , దాని వాళ్ళ సమాజానికి నష్టం జరగటం ఖాయం . పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులే మాట్లాడగా లేనిది, తాము మాట్లాడితే తప్పులేదనే భావన సమాజంలో వస్తుంది. దానివల్ల సమాజానికి ఎంత నష్టం జరుగుతుందో వారు ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read