రాష్ట్ర‌మంతా ల‌క్ష‌ల టిడ్కో ఇళ్లు క‌ట్టి ఉన్నాయి. అవి ల‌బ్ధిదారుల‌కి అంద‌జేయ‌డానికి చేతులు రాని వైసీపీ స‌ర్కారు..కోర్టులో కేసులున్నా..అమ‌రావ‌తిలోనే ఇళ్ల‌ప‌ట్టాల పంపిణీకి తెర లేపుతోంది. ఇదంతా అమ‌రావ‌తి నాశ‌నం మొద‌టి ల‌క్ష్యం కాగా, రాజ‌ధాని ప్ర‌భావిత రెండు జిల్లాల్లో ఏడు నియోజ‌క‌వ‌ర్గాల‌లో వైకాపా ఓట‌మి త‌ప్ప‌ద‌ని నివేదిక‌లు నేప‌థ్యంలో దాదాపు 50 వేల మంది కొత్త ఓట‌ర్ల‌ను ఇళ్ల‌ప‌ట్టాల పేరుతో దింపి ఎన్నిక‌ల్లో ల‌బ్ధిపొందాల‌నే కుతంత్రం ఉంద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం ప్ర‌జారాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళనలకు దిగారు. వారిపై పోలీసుల‌ని ఉసిగొల్పి భ‌య‌పెట్టి, హింసించి వెళ్ల‌గొట్టాల‌నే ప్ర‌య‌త్నాలు విఫ‌లం అయ్యాయి. మ‌రోవైపు రైతులకు మద్దతుగా న్యాయవాది  శ్రావణ్‌కుమార్‌ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నంచేశారు. డిఎస్పీ పోతురాజు అయితే రాజ‌ధానికి భూములు ఇచ్చిన మ‌హిళ‌ల్ని దుర్భాష‌లాడుతూ అంతుచూస్తానంటూ బెదిరించారు. భూములు ఇచ్చిన రైతులు త‌మ ఇళ్లు విడిచి, త‌మ ప్రాంతంలోనే బ‌య‌ట‌కి రాకుండా ఆంక్ష‌లు విధించారంటే ప‌రిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. కోర్టులు ష‌ర‌తులు లోబ‌డి అని చెబుతున్నాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా సెంటు ప‌ట్టాలు ఇవ్వ‌లేని ప్ర‌భుత్వం అమ‌రావ‌తిలోనే ఎందుకు ఇస్తోంద‌ని అంతా ప్ర‌శ్నిస్తున్నారు. నాలుగేళ్లుగా అమ‌రావ‌తిలో ఒక్క ఇటుక పెట్ట‌ని ప్ర‌భుత్వం, ఉన్న నిర్మాణాల‌ని శిథిలం చేసి... కొత్త‌గా  ఆర్‌-5, ఎస్‌-3 జోన్ల‌లో 50వేల మందికి పైగా ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లోని పేదలకు ఇళ్ల స్థలాల‌ను పంపిణీ చేసే కార్య‌క్ర‌మం పోలీసులు బందోబ‌స్తు మ‌ధ్య కొన‌సాగిస్తున్నారు. రెండు జిల్లాల రెవెన్యూ అధికారులు, ఐదు జిల్లాల నుంచి పోలీసులు ఇక్క‌డే విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఇక్క‌డ డ్యూటీకి వ‌చ్చిన ప్ర‌కాశం జిల్లాకి చెందిన కానిస్టేబుల్ ప‌వ‌న్ కుమార్ పాము కాటుకి మ‌ర‌ణించాడు. ఎన్ని అడ్డంకులున్నా, ఇళ్ల‌ప‌ట్టాల పంపిణీయే ల‌క్ష్యంగా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముందుకు వెళ్తుండ‌డం వెనుక ఏదో కుతంత్రం ఉంద‌నే అనుమానాలు నిజ‌మ‌వుతూ వ‌స్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read