ఒక పక్క కరోనా రాష్ట్రంలో, గత రెండు రోజులుగా విలయతాండవం చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, అమరావతి మీద నుంచి ఫోకస్ తప్పించటం లేదు. రాజధాని పరధిలో ఇళ్ల స్థలాల కేటాయింపునకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్డీఏను ప్రభుత్వం ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులకు లోబడి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వ భూములు లేనందున రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వాల్సిందిగా ఆ 2 జిల్లాల కలెక్టర్లు చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టాల్సిందిగా పురపాలక శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు ఆదేశాలు జారీచేశారు. సుప్రీం, హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాజధాని పరిధిలో ఇళ్ల స్థలాల కేటాయింపునకు చర్యలు చేపట్టాలని సీఆర్​డీఏకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్ల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని, చర్యలు చేపట్టాలని పురపాలకశాఖ కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు.

సీఆర్​డీఏలోని భూకేటాయింపుల నిబంధనల్లో సడలించాలని సూచించింది. 2017లో జారీ చేసిన అమరావతి భూకేటాయింపుల నిబంధనల్లో భాగంగా 6.5.1 ప్రకారం రెవెన్యూ విభాగాన్ని ఓ దరఖాస్తుదారుగా పరిగణించాలంటూ తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. పేదలకు ఇళ్లస్థలాల కేటాయించేందుకే రెవెన్యూ శాఖ ఈ పథకాన్ని చేపట్టిందని తెలిపింది. పేదలందరికీ ఇళ్ల పథకాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి సీఆర్డీఏలోని భూకేటాయింపుల నిబంధనల్లో సడలింపు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. మాస్టర్ ప్లాన్​లోనూ నిబంధనల ప్రకారం అవరమైన సవరణలు పరిశీలించాల్సిందిగా ఆదేశాలిచ్చింది. ఈ చర్యలన్నీ సుప్రీం కోర్టు, హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

అమరావతిలో రైతులు ఇచ్చిన భూముల్లో పేదల ఇళ్ల కోసం 1251.51 ఎకరాలను, గతంలో ప్రభుత్వం సిద్దం చేసింది. వేరే ప్రాంతంలోని వారికి, ఇక్కడ భూములు కేటాయించాలని, ప్రభుత్వం అనుకుంది. తాడేపల్లి, దుగ్గిరాల, మంగళగిరి, పెదకాకాని మండలాల్లోని వారికి, అమరావతి పరిధిలో భూములు ఇవ్వాలని అనుకున్నారు. అయితే, దీని పై రాజధాని రైతులు హైకోర్ట్ కు వెళ్లారు. దీని పై విచారణ చేసిన హైకోర్ట్, ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. అమరావతి నిర్మాణం ఏమి జరగకుండా, ఏమి చెయ్యకుండా ఇక్కడ రైతులు ఇచ్చిన భూమి, ఎలా పంచుతారు అంటూ, ప్రభుత్వం పై సీరియస్ అయ్యింది. ప్రభుత్వం అమరావతిలో పంచాలి అనుకునున్న, జీవోని రద్దు చేస్తూ, హైకోర్ట్, గత నెలలో తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read