ఎన్నికల్లో వైసీపీ మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుందని ఆ పార్టీ తెలంగాణ యూనిట్ జనరల్ సెక్రటరీ, వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ పత్రికా ప్రకటన ఇవ్వడం, తన ఆకాంక్షలకు విరుద్ధంగా ఈ ప్రకటన ఉండటంతో ఆయన్ని పార్టీ నుంచి జగన్ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం పై స్పందించిన శివకుమార్, దేశ చరిత్రలో ఓ పార్టీ వ్యవస్థాపకుడిని బహిష్కరించిన ఘనత వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిపై అభిమానంతో ఆయన పేరున ఏర్పాటు చేసిన పార్టీని తెలంగాణలో బతికించుకోవాలనేదే తన తాపత్రయమని పేర్కొన్నారు.

jagan 06122018

ఇటీవల వనపర్తి సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ వైఎస్‌ను దుర్భాషలాడారాని, దాన్ని జీర్ణించుకోలేక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయాలని తాను పిలుపునిస్తే తనను శాశ్వతంగా పార్టీ నుంచి బహిష్కరించారని వాపోయారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తెలంగాణలో పోటీ చేస్తే మొత్తంగా 15 లక్షల ఓట్లు వచ్చాయని, ఈ ఓటర్లందూ ఇప్పుడు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇప్పటికీ ఎన్నికల కమిషన్‌ వద్ద తన పేరునే వైసీపీ నమోదై ఉందని అన్నారు. ‘వనపర్తి ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర రెడ్డిని దుర్మార్గుడు అన్నారు. ఈ మాటలను ఖండిస్తున్నా, టీఆర్ఎస్‌కు ఓటేయొద్దని కోరుతున్నా. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోటీ చేయడం లేదు. వైఎస్ తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ అభిమానుల పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ప్రకటిస్తున్నాం’ అని శివకుమార్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

jagan 06122018

దీంతో జగన్ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. వైఎస్ఆర్ ను తిట్టిన వాళ్ళకు ఓటు వెయ్యద్దు అన్నందుకు, దేశ చరిత్రలో పార్టీ వ్యవస్థాపకుడినే సస్పెండ్‌ చేసిన ఘనత వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. వైఎస్ఆర్ చివరి కోరిక కూడా 42 ఎంపీ సీట్లు గెలిపించి రాహుల్ గాంధిని ప్రధానిని చెయ్యటమే అని, ఆయన ఎన్నో సార్లు ఇది మీడియా ముఖ్యంగానే చెప్పారని, వైఎస్ఆర్ వారసుడు అయిన జగన్ మాత్రం అందుకు విరుద్దుంగా వెళ్తున్నారని అన్నారు. వైఎస్‌ జగన్‌ కోరిక మేరకు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, అతనిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే తనను సస్పెండ్‌ చేశారని తెలిపారు. జగన్‌ 16 నెలలు జైలుకెళ్లినా కూడా పార్టీని ఇక్కడ బతికించుకున్నామని చెప్పారు. పార్టీ నుంచి బహిష్కరించే ముందు కనీసం తన వివరణ కూడా అడగలేదన్నారు. త్వరలోనే కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటానన్నారు.

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read