మాట తప్పం, మడమ తిప్పం అంటూ, వైసిపీ నేతలు చెప్పే డైలాగులకు, గ్రౌండ్ లో జరుగుతున్న పనులకు పొంతన లేకుండా పోతుంది. ఒక్క విషయంలో కాదు, అన్ని విషయాల్లో పనులు అలాగే చేస్తున్నారు. ప్రత్యేక హోదా నుంచి, సిపీఎస్ వరకు, 45 ఏళ్ళ పెన్షన్ నుంచి వివిధ పధకాల వరకు, చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, చంద్రబాబు ఇసుకలో అవినీతి చేసారని ఇసుక పాలసీ మార్చేసారు. రెండు సార్లు మార్చారు. విచిత్రం ఏమిటి అంటే, చంద్రబాబు టైం కంటే, ఇప్పుడు ఇసుక ధర 5 రెట్లు ఉంది. ఇక మరో పక్క మద్యం కూడా అంతే. మొన్నటి దాకా ధరలు షాక్ కొట్టే విధంగా ఉంటే తాగటం మానేస్తారని, ధరలు పెంచాం అన్నారు. తీరా ఇప్పుడు చుస్తే, ఇప్పటికి ధరలు రెండు సార్లు తగ్గించారు. అంటే తాగమని తగ్గించారా ? వివిధ రకాల చార్జీలు, కరెంటు చార్జీలు అంతే. ఈ రేట్లు అన్నీ పూర్తిగా పూర్తిగా తగ్గిస్తాను అంటూ ప్రమాణస్వీకారం రోజు చెప్పి, ఇప్పుడు రెండింతలు పెంచేసారు. ఇలా మాట తప్పుతూ, మడమ తిప్పుతూ పాలన సాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు మరో విషయంలో కూడా మాట తప్పి, మడమ తిప్పేసారు. అదే విద్యుత్ ఒప్పందాలు విషయం. ఈ విద్యుత్ ఒప్పందాల విషయం, అంతర్జాతీయ స్థాయిలో గోల గోల అయ్యింది. వివిధ దేశాలు కూడా, మన రాష్ట్ర వైఖరి పై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసాయి.

jagan 08112020 1

అధికారంలోకి వచ్చిన మొదటి అసెంబ్లీ సమావేశంలో, అసెంబ్లీలో ఒక ప్రెజెంటేషన్ వేసి, చంద్రబాబు విద్యుత్ ఒప్పందాల్లో దోచుకున్నారు అని, అసలు కంపెనీలకు 25 ఏళ్ళతో ఒప్పందం ఏమిటి, బుర్ర బుద్ధి ఉన్నవాడు ఎవరైనా 25 ఏళ్ళకు ఒప్పందం చేసుకుంటారా, టెక్నాలజీ మారిపోతూ వస్తుంది కదా, ఎందుకు ఇలా అంటూ ఒక రేంజ్ లో చంద్రబాబు పై విరుచుకుని పడ్డారు. ఇదంతా అవినీతి అని తేల్చేసారు. అయితే ఇప్పుడు 18 నెలలు తరువాత మాట తప్పి, మడమ తిప్పేసారు. చంద్రబాబు గతంలో కేంద్రం మార్గదర్శకాలు ప్రకారం 25 ఏళ్ళకు ఒప్పందం కుదుర్చుకుంటే, ఇప్పుడు కొత్త రూల్స్ తెచ్చిన జగన్ ప్రభుత్వం, 30 ఏళ్ళ వరకు ఒప్పందాలు చేసుకునే విధంగా రూల్స్ మార్చేసారు. అప్పట్లో తప్పు అని, బుద్ధి ఉందా అని, అవినీతి చేసేసారు అని చెప్పి, ఇప్పుడు కేంద్రం చెప్పిన దాని కంటే ఎక్కువగా 30 ఏళ్ళకు ఒప్పందం చేసుకోవటం పై అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంటే అప్పట్లో చంద్రబాబు పై చేసిన విమర్శలు అన్నీ రాజకీయ విమర్శలేనా ? ప్రజలు మర్చిపోతారని అనుకున్నారా ? రాజకీయంగా వివాదాలు చేసి, ఈ 18 నెలల్లో సోలార్ , విండ్ లో పెట్టుబడులు తగ్గిపోటానికి కారణం అయ్యారా ? ఇలా ఉంటాయి మన రాజకీయాలు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read