వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి నాలుగేళ్లు ద‌గ్గ‌ర కావ‌స్తోంది. అధికారంలోకి వ‌చ్చిన నుంచీ ఇప్ప‌టివ‌ర‌కూ తెచ్చిన జీవోల‌లో చాలా వ‌ర‌కూ కోర్టులు కొట్టేశాయి. అసెంబ్లీలో పెట్టిన బిల్లులు కోర్టుల్లో చుక్కెదురు కావ‌డంతో ప్ర‌భుత్వ‌మే కొన్ని వెన‌క్కి తీసుకుంది. తాజాగా ఫ్లెక్సీల నిషేధం విధిస్తూ ఇచ్చిన జీవోని ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ సంద‌ర్భంగా కోర్టు వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. తెస్తున్న జీవోల‌ను కోర్టులు కొట్టేస్తున్నాయ‌ని మాపై ఏడ్చే బ‌దులు ..ఆ జీవో తీసుకొచ్చే ముందు ఎఫెక్ట‌య్యే వ‌ర్గాల‌తో చ‌ర్చించితే బాగుండేది అని చుర‌క‌లంటించింది. ల‌క్ష‌ల మంది ఫ్లెక్సీల త‌యారీపై ఆధార‌ప‌డి జీవిస్తున్నారు. వారికి ప్ర‌త్యామ్నాయం చూప‌కుండా స‌డెన్‌గా ఓ స‌భ‌లో ప్ర‌క‌టించేశారు. నిషేధం విధించిన జ‌గ‌న్ రెడ్డి త‌న‌కు మాత్రం స్వాగ‌తం ప‌లికేందుకు ప్ర‌తీచోటా ఫ్లెక్సీలు పెట్టించుకుంటున్నారు. ఫ్లెక్సీ నిషేధం విధిస్తూ ఇచ్చిన జీవోని  హైకోర్టు కొట్టేసింది. ఇప్ప‌టివ‌ర‌క‌కూ ఇలాంటివి 100కి పైగానే జీవోలు కోర్టులు కొట్టేశాయి. మూడు రాజ‌ధానుల‌బిల్లు, సీఆర్డీఏ చ‌ట్టం ర‌ద్దు బిల్లు, శాస‌న‌మండ‌లి ర‌ద్దు బిల్లు,  రియ‌ల్ ఎస్టేట్ లేఅవుట్ లలో 5% ప్రభుత్వానికి భూమి ఇవ్వాల‌నే బిల్లుల‌పైనా కోర్టుల‌తో మొట్టికాయ‌లు తినాల్సి వ‌స్తుంద‌ని  తామే వెన‌క్కి తీసుకుంటున్నామ‌ని కోర్టుకు ప్ర‌భుత్వం నివేదించింది. అయితే వైసీపీ స‌ర్కారు ఇస్తున్న జీవోలు, తెస్తున్న బిల్లులు నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఉండేలా రూపొందించాల్సిన అధికారులు కావాల‌నే లోప‌భూయిష్టంగా చ‌ట్టాల‌ను అతిక్ర‌మించేలా రూపొందిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లూ వ‌స్తున్నాయి. మొండిగా, రూల్స్ కి వ్య‌తిరేక‌మైన ప‌నులు చేయాల‌ని స‌ర్కారు పెద్ద‌లు ప‌ట్టుబ‌డుతుండ‌డంతో నిబంధ‌న‌లు ఉల్లంఘించి మ‌రీ చ‌ట్ట‌వ్య‌తిరేక జీవోలు అధికారులు ఇస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read