తమ వాదన కరెక్ట్ అని ప్రజలకు చెప్పటానికి, జగన్ ప్రభుత్వం గత మూడు నెలలుగా నానా తంటాలు పడుతుంది. ఎలాగైనా చంద్రబాబు పై అవినీతి ముద్రలు వెయ్యాలని, గత మూడు నెలలుగా తవ్వుతూనే ఉన్నారు. చివరకు జగన్ మోహన్ రెడ్డి, సచివాలయానికి మొదటి సారి వెళ్ళిన సందర్భంలో, గతప్రభుత్వంలో మీకు తెలిసిన అవినీతి ఏమైనా ఉంటే చెప్పండి, మీకు బహుమతులు ఇస్తాను అంటూ ఉద్యోగస్తులకు ఆఫర్ కూడా ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు ఏమి లేదు. ఇక విద్యుత్ ఒప్పందాల విషయంలో కూడా ఇదే తంతు. ఎదో జరిగి పోయింది అంటూ, కేంద్రం ఎన్ని సార్లు వార్నింగ్ ఇచ్చినా వినకుండా, చివరకు ఏమి దొరక్క, కేంద్రం మాటే వినే పరిస్థితి వచ్చింది. పోలవరం కూడా అదే తీరు. ఇప్పుడు అమరావతి టార్గెట్ గా జగన్ పావులు కదపుతున్నారు. రాజధానిలో ఏదో స్కాం జరిగింది అని జగన్ నమ్మకం.

sujana 19092019 2

అందుకే ఇప్పుడు దాని పై ఫోకస్ చేస్తూ, సుజనా చౌదరిని టార్గెట్ చేసారు. సుజనా చౌదరి బీజేపీలో చేరిన దగ్గర నుంచి, జగన్ పై దూకుడుగా మాట్లాడుతున్నారు. ఆయన బీజేపీ కావటంతో, సుజనాను అంతే ధీటుగా సమాధానం ఇవ్వటానికి వైసీపీ ఆలోచిస్తుంది. అందుకే సుజనా పై అవినీతి మరకలు వేసి, సుజనాను సైలెంట్ చెయ్యాలని ప్లాన్ చేసారు. అందుకే సుజనా పై ఒక సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెట్టారు. సుజనాకు కాని, అయన బంధువులకు కాని, అమరావతి ప్రాతంలో భూములు ఉన్నాయా, లేక వారి బినామీలతో ఉన్నాయా అన్న కోణంలో జగన్ ప్రభుత్వం రహస్య విచారణ మొదలు పెట్టింది. గత వారం రోజులుగా దీని పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందు కోసం, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు అయిన రెవెన్యూ, సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులను రంగంలోకి దించారు.

sujana 19092019 3

వీరు గత వారం రోజులుగా గుట్టుగా విచారణ చేస్తున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని మోగులూరు, మున్నలూరు, బత్తినపాడు, చెవిటికల్లు గ్రామాల పరిధిలో ఒక దర్యప్తు బృందం పర్యటించింది. బుధవారం ఈ బృందాలు అక్కడ గ్రామాల్లో తిరిగి స్థానిక రైతులను, సుజనా భూములు బినామీలు ఏమైనా ఉన్నాయా అనే విషయం ఆరా తీసారు. అలాగే గతంలో జరిగిన భూముల క్రయవిక్రయాల పై సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు. కంచికచర్ల తహసీల్దార్‌ వి.రాజకుమారిని వివరణ కోరగా, అధికార బృందం వచ్చి విచారణ చేసిన విషయం వాస్తవమే అని చెప్పారు. అయితే, సుజనా చౌదరి పై రాష్ట్ర ప్రభుత్వం, కావాలని నిఘా పెట్టి, ఇబ్బందుల్లోకి నేట్టటానికి ట్రై చేస్తుంటే, బీజేపీ చూస్తూ ఊరుకుంటుందా ? తరువాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది వేచి చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read