ఆంధ్రప్రదేశ్ లోని పేద యువతులకు  వివాహం చేసుకునేందుకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రవేశ పెట్టిన దుల్హన్ పధకం పై వైసిపి ప్రభుత్వం చేతులేత్తేసింది. ఈ పధకం ప్రకారం పెళ్లి చేసుకునే మైనారిటీ యువతులకు తెలుగుదేశం ప్రభుత్వం  అప్పట్లో 50 వేలు అందించింది. అయితే  ఈ పధకాన్ని  వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిలిపి వేసింది. అప్పట్లో ఎన్నికల ప్రచారంలో జగన్ ఈ 50 వేలను లక్ష రూపాయలు చేస్తానని కూడా హామీ ఇచ్చింది. కాని వారు అధికారం లోకి వచ్చాక అసలు ఈ పధకాన్నే నిలిపివేశారు. అయితే ఈ పదకాన్ని మళ్ళి పునరుద్దరించాలని , అదే విదంగా జగన్ హామీ ఇచ్చిన ప్రకారం ఈ పదకాన్ని 50 వేల నుంచి  లక్ష రూపాయలు చేయాలనీ రాష్ట్ర హై కోర్ట్ లో ఒక పిటీషన్ దాఖలైంది . ఈ పిటీషన్ పై విచారణ కూడా జరిగింది. మైనారిటీ హక్కుల పరిరక్షణ కమిటీ నేత   షిబ్లీ దాఖలు చేసిన పిటీషన్ పై సీనియర్ న్యాయవాది యస్ యస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వ తరుపున న్యాయవాది వాదిస్తూ దుల్హన్ పధకం అమలు చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు  లేవని తేల్చి చెపారు. దీనితో ఒక్కసారిగా కోర్ట్ హాలు అంత నవ్వులు వినిపించాయి. దీని పై వెంటనే రిప్లయ్  పిటీషన్ ఇవ్వాలని కోర్ట్ ఆదేశించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read