రెండు రోజుల క్రితం ఇండియా టుడే సంస్థ మూడ్ అఫ్ ది నేషన్ పేరిట ఒక సర్వే విడుదల చేసింది. అందులో కేంద్రం స్థాయిలో ఎన్డీఏ, యుపీఏ బలా బలాలు, ఏ పార్టీలు ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తాయి, కేంద్ర స్థాయిలో ప్రతిపక్ష నేతగా ఎవరు ఉంటే బాగుటుంది ? సొంత రాష్ట్రంలో కాకుండా, బయట రాష్ట్రాల్లో ఏ సియంకు ఆదరణ ఉంది. సొంత రాష్ట్రాల్లో సియంలకు ప్రజల్లో ఎంత ఆదరణ ఉంది, ఇలా అనేక అంశాలతో ఇండియా టుడే సమగ్రంగా కధనం ప్రసారం చేసింది. అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, జగన్ మోహన్ రెడ్డి వన్ సైడ్ గా గెలుస్తాడని, ఆయనకు 25 ఎంపీ సీట్లు వస్తాయని ఇండియా టుడే చెప్పింది అంటూ, బులుగు మీడియా ఊదరగొట్టింది. బులుగు మీడియా, సోషల్ మీడియా, ఇలా మొత్తం, జగన్ మోహన్ రెడ్డి తిరుగు లేదు అంటూ డబ్బా కొట్టుడు మొదలు పెట్టారు. ఒక పక్క అన్ని వర్గాలు ఈ పాలనను అసహ్యించుకుంటుంటే, బులుగు మీడియా ఇలా ప్రచారం చేయటం, ఇండియా టుడే సర్వే పై పలువురు ఆశ్చర్య పోయారు. అసలు ఇండియా టుడే రిపోర్ట్ లో ఏముందో అంటూ, ఆన్లైన్ లో చూస్తే, అక్కడ డబ్బులు కట్టి subscribe చేస్తే కానీ రిపోర్ట్ ఇవ్వం అని వస్తుంది. అయితే ఈ రోజు ఇండియా టుడే ఎడిషన్ మార్కెట్ లోకి వచ్చింది.

it 22012022 2

దీంతో అసలు గుట్టు బయట పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీ సీట్ల విషయంలో, ఇండియా టుడే బ్రేక్ అప్ ఇచ్చింది. అందులో ఎన్డీఏ కి సున్నా సీట్లు, యుపీఏకి సున్నా సీట్లు, ఇతరులకు 25 ఎంపీ సీట్లు అని ఉన్నాయి. అంటే, బీజేపీ, కాంగ్రెస్, బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనకు ఒక్క ఎంపీ సీటు కూడా రాదనీ, ఇతరులలో టిడిపి, వైసీపీ లను కలిపింది. ఎక్కడా కూడా వైసిపీకి ఇన్ని సీట్లు, టిడిపికి ఇన్ని సీట్లు, లేదా జగన్ పాలనకు తిరుగు లేదు అని, ఎక్కడా రాయలేదు. అక్కడ రాసింది జగన్ గ్రాఫ్ పడిపోతుందని. మూడు అంశాల్లో జగన్ గ్రాఫ్ పడిపోయిందని ఇండియా టుడే రాసింది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష నాయకుల ర్యాంక్ లో, జగన్ 4% నుంచి 1 % నికి పడిపోయారు. అలాగే రాష్ట్రం వెలుపల బెస్ట్ సియంగా, ఆరు శాతం నుంచి మూడు శాతానికి పడిపోయారు. సొంత రాష్ట్రంలో బెస్ట్ సియం ఎవరు అనే దాంట్లో, జగన్ ర్యాంక్ ఒకటో స్థానం నుంచి, పదో స్థానంలో కూడా లేకుండా, అడ్రస్ కూడా లేకుండా పడిపోయారు. సర్వేలో ఇలా స్పష్టంగా ఉంటే, బులుగు మీడియా ఎందుకు ఇంత హడావిడి చేస్తుందో మరి ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read