జగన్ గారు, ప్రతిపక్ష నేతగా ఉండంగా, మొదటి సారి పాదయాత్ర మొదల పెట్టిన సందర్భంలో, జగన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్, "నాకు కసి ఉంది. అది అవినీతిని నిర్మూలించాలి అనే కసి" అంటూ జగన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి తగ్గట్టే సియం అయిన తరువాత కూడా, నేను అవినీతిని కడిగేస్తా, అవినీతిని పాతరవేస్తా అంటూ చెప్తూ వచ్చారు. నిన్న జరిగిన స్పందన కార్యక్రమంలో కూడా జగన్ మోహన్ రెడ్డి, ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. వ్యవస్థను కడిగేద్దాం, నా స్థాయిలో నేను శుభ్రం చేయడం ప్రారంభించా అంటూ జగన్ మోహన్ రెడ్డి, కలెక్టర్లు, ఎస్పీలూతో జరిగిన టెలి కాన్ఫరెన్స్ లో ఈ విషయం స్పష్టం చేసారు. అవినీతి అనేది నేను సహించనని, అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ నా లక్ష్యం అంటూ జగన్ స్పందించారు.

అయితే ఈ విషయం పై విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని స్పందించారు. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో, ప్రభుత్వ చేస్తున్న పనుల పై ప్రశ్నలు సంధిస్తున్న నాని, జగన్ అవినీతి పై పోరాటం చేస్తాను అనటం పై, స్పందించారు. దీనికి సంబంధించి ఈనాడు పత్రికలో వచ్చిన క్లిప్పింగ్ ట్విట్టర్‌లో షేర్ చేసిన టీడీపీ నాని, జగన్‌పై సెటైర్లు వేశారు. ‘‘వ్యవస్థను కడిగే ముందు మనని మనం కడుగుకోవాలి జగన్ గారూ! కడిగిన ముత్యాలు మాత్రమే వ్యవస్థను కడగగలవు. ఈడీ, సీబీఐ కేసులున్న మీరెలా కడగగలరు’’ అని పోస్ట్ చేసారు. జగన్ మోహన్ రెడ్డి పై 31 కేసులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన పై సిబిఐ, ఈడీ కేసులు కూడా ఉన్నాయి. 16 నెలలు జైల్లో ఉండి, కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతున్న జగన్, మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి, అవినీతి పై యుద్ధం చేస్తానని చెప్తున్నారు.

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read