రాష్ట్ర ప్రభుత్వానికి వరుస షాకులు తగుతులున్నాయి. నిన్న ట్రెజరీ ఉద్యోగులు కొత్త వేతన బిల్లులు ప్రాసెస్ చేయం అని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వానికి జలఖ్ ఇచ్చారు. ఈ రోజు పే అండ్ అకౌంట్స్, అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి శాఖాధిపతుల కార్యాలయాల్లో ఉండే అటెండర్ల దాకా, ఏ బిల్స్ అయిన చూసే పే అండ్ ఆకోంట్స ఆఫీస్, కొద్ది సేపటి క్రితం వేతన బిల్లులను ప్రాసెస్ చేయమని, తమ మీద ఒత్తిడి తీసుకుని రావద్దని, కొత్త పీఆర్సి ఏదైతే ఉందో, దానికి నిరసనగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఏవైతే ఆందోళన చేస్తున్నాయో, అందులో తాము కూడా పాలు పంచుకుంటున్నామని,  పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారు లేఖ రాసారు. ఈ మేరకు తమ మీద వస్తున్న ఒత్తిడిని నిలిపివేయాలని వారు లేఖలో కోరారు. ఇక ఇదే విధంగా రాష్ట్రంలో జ్యుదిషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కూడా కొద్ది సేపటి క్రితం మరో లేఖ రాసింది. అన్ని జిల్లాల్లో కూడా ఉద్యోగ సంఘాలు ఏవైతే ఆందోళన చేస్తున్నాయో, ఆ ఆందోళనకు తాము కూడా మద్దతు పలుకుతున్నామని, ఎప్పుడు పిలుపు ఇస్తే అప్పుడు తాము కూడా ఉద్యమం లోకి వస్తామని, వారు కూడా చెప్పారు. మొత్తానికి అన్ని వైపుల నుంచి ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పటం లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read